Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు.. 19 మంది మృతి! దీని లక్షణాలు

Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు.. 19 మంది మృతి! దీని లక్షణాలు


బెంగళూరు, సెప్టెంబర్ 21: మెదడున తినే అమీబా వ్యాధి కేరళలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు. మరణాల సంఖ్య అక్కడ వేగంగా పెరుగుతుందటంతో ఆందోళన నెలకొంది. కేరళ రాష్ట్రంలో అమీబా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఇరుగుపొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. హై అలర్ట్‌ జారీ చేశాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో, దాని లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

కేరళలో మెదడును తినే అమీబా విజృంభిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా కేరళలో 19 మంది మరణించారు. 67 మందికి ఈ వ్యాధి సోకింది. ఈ అమీబా సాధారణంగా నిల్వ నీరు, చెరువులు, సరస్సులలో పెరుగుతుంది. అలాంటి నీటిలో ఈత కొడ్డం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మెదడులోకి నేరుగా ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రేటు పెరిగి మరణం కూడా సంభవించవచ్చు.

ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 1 నుంచి 9 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇన్ఫెక్షన్ కు చికిత్స ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • చెరువులు, సరస్సులు, నిల్వ నీటిలో స్నానం చేయడం లేదా ఈత కొట్టడం చేయరాదు.
  • మంచినీటిలో ఈత కొట్టేటప్పుడు ముక్కు క్లిప్‌లను ఉపయోగించడం.
  • క్లోరిన్ ఉపయోగించి బావులు, నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం.
  • నిల్వ ఉన్న నీటిని తాకిన వారికి జ్వరం లేదా తలనొప్పి వంటి లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *