Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్! హౌస్‌లోకి ఆ కాంట్రవర్సీ క్వీన్స్

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్! హౌస్‌లోకి ఆ కాంట్రవర్సీ క్వీన్స్


Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్! హౌస్‌లోకి ఆ కాంట్రవర్సీ క్వీన్స్

 

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారం ముగింపు దశకు చేరుకొన్నది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీల క్యాటగిరీలో భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరీ, సంజనా గల్రానీ, తనూజా, శ్రష్టి వర్మ, ఆశా సైనీ, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక కామన్ మ్యాన్ గ్రూప్ నుంచి శ్రీజ దమ్ము, డీమాన్ పవన్, పవన్ కల్యాణ్, హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి తదితరులు షోలోకి వచ్చారు. వీరిలో తొలి వారం శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం కూడా మరొకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. రెండో వారంలో 7 గురు సభ్యులు నామినేషన్స్ లో నిలిచారు. హరిత హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్ ఈ లిస్టులో ఉన్నారు. వీరిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ క్రమంలో గత సీజన్ మాదిరిగానే ఈసీజన్ లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడానికి సిద్దంగా ఉన్నాడు. 3వ వారంలో మరొకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. అయితే మూడో వారం లేదా నాలుగో వారంలో ఏదో ఒక వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. అంటే మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లనున్నారన్నమాట. దీంతో రెండో దశలో మరో ఐదుగురిని హౌస్ లోకి తీసుకొచ్చే యోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.

కాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సెలబ్రిటీల నుంచి 4 గురు కంటెస్టెంట్లను, కామన్ మ్యాన్ కేటగిరిలో ఒకరిని బిగ్ బాస్ హౌస్ లోకి షోలోకి పంపేదుకు రెడీ అవుతున్నారని టాక్. సెలబ్రిటీల నుంచి రమ్య పికిల్, సింగర్ శ్రీ తేజ, దివ్వెల మాధురి, జ్యోతి రాయ్‌‌ని ఎంపిక చేసినట్టు సమాచారం.  వీరిలో జ్యోతిరాయ్ తప్పితే మిగతా అందరూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిన వారే.

అలేఖ్య చిట్టి పికిల్స్  కూడా..

 

View this post on Instagram

 

A post shared by Ramya moksha kancharla (@ramya_moksha)

అలాగే కామనర్స్ కోటాలో నాగ ప్రశాంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే వీరి కోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించి వారిని ప్రేక్షకు లకు, ఇంటి సభ్యులకు పరిచయం చేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2.o 5 వారం ముగింపులో ఉండనున్నట్లు సమాచారం. త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది.

జ్యోతి రాజ్ లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *