బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారం ముగింపునకు వచ్చేసింది. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. ఈ ఆదివారం (సెప్టెంబర్ 21) మరొకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రానున్నారు. రెండో వారం లో సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, ప్రియా, మర్యాద మనీష్, భరణి, డెమోన్ పవన్, హరిత హరీష్ నామినేషన్స్ లో ఉన్నారు. శుక్రవారంతో వీరికి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. ఓటింగ్ సరళిని బట్టి కామనర్స్ ప్రియా శెట్టి, మనీష్ మర్యాద అలాగే నటి ఫ్లోరా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం తక్కువ ఓటింగ్ తో త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరాకు ఈ వారం కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈ ముగ్గురిలో ఫ్లోరానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. ఫ్లోరాతో పాటు ప్రియా శెట్టి లేదా మనీష్ మర్యాద హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ కి పంపించే ఛాన్స్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇక శనివారం (సెప్టెంబర్ 21) బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది. ముఖ్యంగా హౌస్ లో ప్రేమ పక్షులు గా మారిన రీతూ చౌదరి, డీమాన్ పవన్ లకు ఊహించని షాకిచ్చారు హోస్ట్ నాగార్జున. ‘రంగు పడుద్ది’ కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా రీతూ ఆటతీరును నాగ్ తప్పు పట్టారు.
భరణి విషయంలో తన డెసిషన్ తప్పని వీడియోలతో సహా బయటపెట్టారు. దీంతో రీతూ పాప మొహం మాడిపోయింది. మరోవైపు డిమాన్ పవన్ కెప్టెన్సీ గెలిచిన తీరు సరైనది కాదని.. అతడి కెప్టెన్సీ రద్దు చేశారు నాగ్. మరి ఈ వీకెండ్ ప్రోగ్రామ్ ఎలా సాగనుందో.. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఇవి కూడా చదవండి
1633894,1633803,1632882,1633777
The ultimate twist this week! 👁️💥 Owners lose their thrones, and tenants claim them! 👑🏠
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/PA4bEwUmqX
— Starmaa (@StarMaa) September 20, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి