Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..


పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టగలరా.. ? యోగా, వర్కవుట్లతో హీరోయిన్ రేంజ్ ఫిట్నెస్ తో కట్టిపడేస్తుంది. ఆమెకు ఇప్పుడు ఫాలోయింగ్ మరింత పెరిగింది. బుల్లితెరపై, సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతుంది. ఇన్నాళ్లు అందం, నటనతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన బిహేవియర్, ఆట తీరుతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 9లో టాస్కులలో ఆడపులిలా దూసుకుపోతుంది. అలాగే స్నేహానికి అండగా ఉంటూ.. ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంటుంది. ఇప్పుడు ఆమెకు నెట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో శివంగి ఎవరో గుర్తుపట్టారా.. ? ఈ అమ్మడు మరెవరో కాదు.. ముద్ద మందారం ఫేమ్ తనూజ పుట్టస్వామి.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

కన్నడ, తెలుగులో పలు సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ఆమె. బెంగళూరులో పుట్టి పెరిగిన తనూజ.. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కన్నడలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత కన్నడలో హారర్ సినిమా 6-5=2 తో సినీ రంగ ప్రవేశం చేసింది, ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో కనిపించింది. ముద్ద మందారం సీరియల్ తో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఆమె.. ఫస్ట్ సీరియల్ తోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందులో పార్వతి పాత్రలో కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ముద్ద మందారం తర్వాత చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉన్న తనూజ.. ఇటీవలే కుక్ విత్ జాతిరత్నాలు షోలో పాల్గొంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టింది. తన ఆట తీరు, ప్రవర్తనతో జనాలకు దగ్గరవుతుంది. తనూజకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. అటు ట్రెడిషనల్, ఇటు గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *