బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈ వారంలో కూడా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచినట్లు తెలుస్తోంది. వారెవరో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయితే కానీ ఫుల్ క్లారిటీ రాదు. మరోవైపు గత సీజన్ల లాగే ఈ సీజన్స్ లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీల ఉండనున్నాయని తెలుస్తోంది. ఐదు లేదా ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ రెండో దశలో హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. దివ్వెల మాధురి, కావ్య శ్రీ, రమ్య మోక్ష ,రమ్య మోక్ష, సింగర్ శ్రీ తేజ, జ్యోతి రాయ్ త్వరలోనే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరి కంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్టులో ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతను ఇప్పటికే ఒకసారి బిగ్ బాస్ లో సందడి చేశాడు. తనదైన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఏకంగా రన్నరప్ గా నిలిచాడు. ఈ నటుడికి బుల్లితెరలో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ బుల్లితెర నటుడు హీరోగా మారిపోయాడు. ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 9 లో ఈ నటుడిని కంటెస్టెంట్ గా పంపనున్నట్లు సమాచారం. అది కూడా రాయల్ కంటెస్టెంట్ గా.. అంటే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల కంటే ఈ ముందే ఈ నటుడి ఎంట్రీ ఉండనుందని సమాచారం.ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారా?
బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ మళ్లీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హౌస్ లో 13 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్పీ దృష్ట్యా అమర్ దీప్ ను బి హౌస్ లోకి తీసుకొని వస్తే కచ్చితంగా సీజన్ కి బాగా ఉపయోగపడుతుందని బిగ్ బాస్ టీం భావిస్తోందని సమాచారం. ఇందుకోసం అతనికి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు రెడీగా ఉన్నారని టాక్.
ఇవి కూడా చదవండి
జిమ్ లో అమర్ దీప్..
ఈ విషయంపై ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ అమర్ దీప్ ను కూడా సంప్రదించిందని, అతను కూడా పాజిటివ్ గానే స్పందించినట్లు సమాచారం. తన సినిమాల కమిట్మెంట్స్, డేట్స్ ని చూసుకొని బిగ్ బాస్ కు వస్తానని అమర్ దీప్ చెప్పాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.