Bigg Boss Nikhil: సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్ ఇదిగో

Bigg Boss Nikhil: సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్ ఇదిగో


Bigg Boss Nikhil: సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్ ఇదిగో

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నిఖిల్ మలియక్కళ్ కూడా ఒకడు. అంతకు ముందు పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. గోరింటాకు, ఊర్వశివో రాక్షసివో, కలిసి ఉంటే కలదు సుఖం, స్రవంతి తదితర సీరియల్స్ నిఖిల్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆక్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడీ సీరియల్ యాక్టర్. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. స్టార్స్ ను కాదని బిగ్ బాస్ టైటిల్ ను గెల్చుకున్నాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్న నిఖిల్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. సొంత ఇంటి కల నెరవేరిందన్న శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో తన కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు బుల్లితెర ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు నిఖిల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా గృహ ప్రవేశం కార్యక్రమంలో నిఖిల్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులందరూ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక టీవీ షోస్, వెబ్ సిరీస్ ల సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచాడు నిఖిల్. ‘గోరింటాకు’ సీరియల్‌లో తనతో కలిసి నటించిన కావ్యశ్రీతోనే అతను ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే చాలా సార్లు జంటగానే కనిపించారు నిఖిల్, కావ్య. పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి విడిపోయారు. బిగ్‌బాస్ షోలోకి వచ్చేముందే నిఖిల్, కావ్య విడిపోయారు. ఇప్పుడు ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉంటున్నాడు. కావ్య కూడా పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బుల్లితెరపై బిజీగా ఉంటోంది.

గృహప్రవేశ కార్యక్రమంలో నిఖిల్ మలియక్కల్

 

View this post on Instagram

 

A post shared by DISHANK MALIYAKKAL (@_dishankz_)

 

View this post on Instagram

 

A post shared by DISHANK MALIYAKKAL (@_dishankz_)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *