Bigg Boss 9 Telugu: సీక్రెట్ రూంలో సంజన.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్..

Bigg Boss 9 Telugu: సీక్రెట్ రూంలో సంజన.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్..


Bigg Boss 9 Telugu: సీక్రెట్ రూంలో సంజన.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్..

బిగ్‌బాస్ సీజన్ 9.. మూడో వారం కొత్త కొత్త మలుపులతో మొదలైంది. హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్య నిఖితా కామనర్స్ కు షాకిచ్చింది. వారి బిహెవియర్, తప్పులను చెబుతూ గట్టిగానే ఇచ్చిపడేసింది. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్కులు, గొడవలతో సాగింది. చివరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ అందరికి మరోసారి హడలెత్తించాడు బిగ్‌బాస్. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్కులో ఐదుగురు పోటీ పడగా.. ఇమ్మాన్యుయేల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత అందరూ నిద్రలో ఉండగా.. అర్దరాత్రి సైరన్ మోగించి కంటెస్టెంట్లను నిద్ర లేపాడు బిగ్‌బాస్. దీంతో అందరూ నిద్రలేచి గార్డెన్ ఏరియాకు వచ్చారు. నా చక్రవ్యూహం మొదటి అధ్యాయంలో దివ్య ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అందులోని మరో అద్యాయానికి సమయం వచ్చింది. హౌస్మేట్స్ అందరూ మీకు లభించిన ఫలాల్లోని బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు రెడ్ సీడ్ పొందినవారు వంతు. ఎప్పుడూ లేని విధంగా రెడ్ సీడ్ వచ్చినవారిలో ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపే అధికారాన్ని ఇస్తున్నాను. దివ్య నేను పంపిన సభ్యురాలు.. ఫ్లోరా ఇమ్యూనిటీ గెలుచుకున్నారు. వీరిద్దరిని కాకుండా రెడ్ సీడ్ వచ్చినవారిలో ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపేందుకు నిర్ణయించాల్సి ఉంటుంది అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

దీంతో రెడ్ సీడ్ వచ్చిన భరణి, హరీష్, కళ్యాణ్, డీమాన్, రాము మాట్లాడుకోవడానికి లోపలికి వెళ్లారు. ముందుగా హరీష్ సంజన పేరు చెప్పాడు. బిగ్‌బాస్ షో దొంగతనాల షో అనిపించుకోవడం ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆమె సేఫ్ గేమ్ ఆడుతుందని రాము అన్నాడు. సంజన తర్వాత సెకండ్ ఆప్షన్ ఎవరి పేరు చెప్తారు అని భరణి అడిగితే.. నాకు ఎవరూ కనపడట్లేదు అంటూ హరీష్ చెప్పాడు. దీంతో సంజన పేరే డిసైడ్ చేద్దామా అని కళ్యాణ్ అన్నాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ముందు సంజన పేరు చెప్పారు హరీష్. ఆవిడ ఎమోషన్స్ తో ప్లే చేయడం చేస్తున్నారని డీమాన్ పవన్ అన్నాడు. దివ్యగారిని పర్సనల్ టార్గెట్ చేసి మరీ ఆవిడకు సంబంధించిన కాస్ట్యూ్మ్స్ దాచేయడం నచ్చలేదు అంటూ రీజన్ చెప్పాడు. ఇక అందరూ మాట్లాడక నేను మాట్లాడొచ్చా అంటూ సంజన తన అభిప్రాయం చెప్పింది. దివ్య వస్తువుల దొంగతనంలో నేను ఒంటరిగా లేను కాద.. వాళ్లకు నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా నాకు తెలీదు. ఈరోజు నాకు దివ్య థర్డ్ ర్యాంక్ ఇచ్చింది. నేను థర్డ్ ప్లేస్ లో ఉన్నాను కాబట్టి తను స్ట్రాంగ్ గా ఉందని అని పక్కకి జరిపేస్తే మా దారి క్లియర్ అవుతుందని అనుకున్నారో.. కాంపిటేషన్ లో నన్ను కార్నర్ చేసి బయటకు పంపిస్తున్నారా నాకు తెలీదు.. నేను ఎవరినీ పర్సనల్ హర్ట్ చేయలేదు. నా దగ్గరికి వచ్చి అటాక్ చేస్తే నేను డిఫెండ్ చేసుకున్నాను. నన్ను క్లియర్ గా కార్నర్ చేస్తున్నారు. నేను మాత్రం షో కోసం 100 కాదు 500 పర్సంట్ ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చింది సంజన.

సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ కావడంతో ఇమ్మాన్యుయేల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా.. దేవుడికి చూడు నాకు బయట ఇంకొక బిడ్డ ఉన్నాడు.. నేను పోయి తనని చూడాలని ఉందేమో.. నువ్వు టైగర్ ఏడవకూడదు. నేను ఒంటరిగా పోతున్నాను. నీతో అందరూ ఉన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన. ఆ తర్వాత ఇమ్మూ మరింత ఎమోషనల్ అయ్యాడు. నేను షో కోసం ఏదోకటి చేస్తాను.. అది నెగిటివ్ అయినా పర్లేదు.. నా తప్పులు నీ మీద పడకూడదు అంటీూ తను తప్పు చేసేటప్పుడు నన్ను దగ్గరకు రానివ్వలేదు అనుకుంటూ ఇమ్మూ ఏడుస్తుంటాడు. ఇదంతా సంజన సీక్రెట్ రూంలో నుంచి చూస్తుంది. ఆ తర్వాత ఆ ఐదుగురు డిస్కస్ చేసిన వీడియో కావాలని రిక్వెస్ట్ చేస్తుంది సంజన. వచ్చిన రెండు వారాలు కంటిన్యూగా రాత్రంతా ఏడ్చింది. అందుకే ఆమెను అరగంట నవ్వించి పడుకోవడం స్టార్ట్ చేశా.. అప్పుడు పడుకునేది. పిల్లల్ని మిస్ అవుతున్నాను అనేది. కానీ ఆ బాధ ఎప్పుడూ చూపించలేదు అని చెబుతూ ఏడ్చాడు ఇమ్మాన్యుయేల్.

ఆ తర్వాత భరణి మాట్లాడుతూ.. ఆమె తిరిగి వస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని ఇమ్మూతో అన్నాడు. సీక్రెట్ హౌస్ లో ఉంటారు.. మళ్లీ వస్తారు అని హరీష్ సైతం రాముతో అన్నారు. ఆట్ల ఆడితో కనిపిస్తది.. ఇలా క్రియేట్ అవుతుందని అనుకుంటే ఇక్కడ ఎవరూ తగ్గరు.. కానీ మనకు అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే మైండ్ సెట్ లేదు అని రాము అనడంతో హరీష్ సైతం అవును అన్నాడు. మరోవైపు వాష్ రూమ్ ఏరియా దగ్గర రీతూతో పులిహోర కలుపుతున్నాడు డీమాన్ పవన్.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *