Bigg Boss 9 Telugu : శ్రీజ దెబ్బకు రీతూ ఏడుపు.. నామినేషన్స్ నుంచి ఫ్లోరా ఔట్.. డేంజర్ జోన్‍లో ఆ కంటెస్టెంట్..

Bigg Boss 9 Telugu : శ్రీజ దెబ్బకు రీతూ ఏడుపు.. నామినేషన్స్ నుంచి ఫ్లోరా ఔట్.. డేంజర్ జోన్‍లో ఆ కంటెస్టెంట్..


బిగ్‌బాస్ సీజన్ 9లో మూడో వారం నడుస్తోంది. ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ జరగ్గా.. ఇప్పుడు మూడో ఎలిమినేషన్ కోసం సమయం దగ్గరపడింది. ఈ క్రమంలోనే హౌస్ లో ఇమ్యూనిటీ టాస్కులు నడుస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్యునిటీ పొందేందుకు బిగ్‌బాస్ ముగ్గురికి అవకాశం ఇచ్చాడు. అందులో దమ్ము శ్రీజ, రీతూ చౌదరి, ఫ్లోరా సైనిలకు గురితప్పదు అంటూ ఓ గేమ్ పెట్టాడు. ఇందులో రీతూ గేమ్ అదరగొట్టింది. కానీ శ్రీజ తెలివికి దెబ్బకు ఏడుపు మొదలెట్టెంది. రీతూ బలంగా ఆడితే శ్రీజ తెలివితో ఆడి రీతూకు చెక్ పెట్టింది. వీళ్లిద్దరి గొడవలో విజయం దక్కించుకుంది ఫ్లోరా. సైలెంట్ గా తన ఆట తాను ఆడేస్తూ ప్రశాంతంగా టాస్కు గెలిచింది. బ్లాక్ సీడ్ వచ్చిన శ్రీజ, రీతూ, ఫ్లోరా సైనికి ఇమ్యూనిటీ.. కేవలం ఒక్కరికే అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. గురితప్పకు అనే టాస్కు ఇచ్చాడు.. ఇందులో కేజ్ లోకి వెళ్లి సంచాలకులు విసిరిన బాల్స్ ను తీసుకుని బయట నేల మీద ఉన్న తమ బాక్స్ లో ఉంచాలి.. ఎవరైతే ముందుగా తమకు కేటాయించిన బాస్కెట్ లో మూడు బాల్స్ వేస్తారో వారు ఈ టాస్క్ విజేతగా నిలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవన్ పొందుతారు అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

ఈ గేమ్ స్టార్ట్ కాగానే రీతూకు, శ్రీజ మధ్యే అసలు పోటి నడిచింది. శ్రీజ బాల్ అందుకున్న ప్రతిసారి రీతూ అడ్డుపడింది. శ్రీజను బయటకు వెళ్లకుండా బలంగా ఆపేసింది. శ్రీజ పైకి ఎక్కి.. మెడ పట్టుకుని డిఫెండ్ చేసింది. ఆ సమయంలో అటు హౌస్మేట్స్, ఇటు అడియన్స్ కు సైతం టెన్షన్ అనిపించింది. దీంతో సంజన, ప్రియ రీతూ జాగ్రత్త అంటూ అరిచారు. దీంతో ప్రియాకు కౌంటర్స్ ఇచ్చింది రీతూ. అయితే ప్రతిసారి తనను బలంగా ఆపుతున్న రీతూను ఈసారి తెలివితో దెబ్బకొట్టింది శ్రీజ. ఎలాగూ తనని బాల్ పట్టుకుని బయటకు వెళ్లడానికి రీతు వదలదు అని అర్థం చేసుకున్న శ్రీజ.. బాల్ పడిన వెంటనే రీతూనే ఆపేసి బాల్ ఫ్లోరా చేతికి వెళ్లేలా చేసింది. దీంతో ఫ్లోరా బాల్స్ అన్నింటిని తన బాక్స్ లో వేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

దీంతో చిరాకేసిన రీతూ.. సరిగ్గా గేమ్ ఆడు.. నువ్వు గెలవాలని ఆడాలి కానీ ఇదేంటీ అంటూ డైలాగ్ కొట్టింది రీతూ. దీంతో నా గేమ్ నా ఇష్టం.. మొన్న నీ బాల్స్ అన్నీ రాముకు ఇచ్చేసి నువ్వు తనకు సపోర్ట్ చేయలేదా.. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా.. నా గేమ్ నా ఇష్టం వచ్చినట్లు ఆడతా అంటూ గట్టిగానే రియాక్ట్ అయ్యింది శ్రీజ. చివరకు ఫ్లోరా బాక్స్ లో 3, రీతూ దగ్గర 4, శ్రీజ దగ్గర ఒక బాల్ ఉన్నాయి. రూల్ ప్రకారం తమ బాక్స్ లో మూడు బంతులను తమ బాస్కెట్లో వేయాలి. అలా ముందుగా వేసిన వాళ్లే విన్నర్ అని ప్రకటించడంతో ముందుగా రీతూ ఒక బాల్ వేసింది. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా బాల్స్ పడలేదు. కానీ ఫ్లోరా మాత్రం వెంట వెంటనే బాల్స్ వేసింది. దీంతో ఈ టాస్కులో ఫ్లోరా గెలిచింది. దీంతో ఈవారం నామినేషన్స్ నుంచి ఫ్లోరా సేవ్ అయ్యింది. మరోవైపు గేమ్ ఒడిపోవడంతో రీతూ ఏడుపు స్టార్ట్ చేసింది. వెంటనే తనూజ వెళ్లి ఓదార్చింది. ఆ తర్వాత డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, భరణి అందరూ రీతూను ఓదార్చారు. అయితే ఫ్లోరా గెలవడంతో ఇప్పుడు నామినేషన్లలో కేవలం ఐదుగురే ఉన్నారు. ప్రియ, రాము, రీతూ, పవన్ కళ్యాణ్, హరీష్ మాత్రమే ఉన్నారు. వీరిలో ప్రియ, రీతూ డేంజర్ జోన్ లో ఉండగా.. ఈసారి ప్రియ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *