బిగ్‌బాస్ సీజన్ 9 రెండో వారం నడుస్తోంది. ఇప్పుడు సెకండ్ వీక్ ఎలిమినేషన్ దగ్గరపడింది. కానీ రెండు వారాల్లోనే హౌస్ లో గొడవలు మరింత హీటెక్కాయి. కెప్టెన్సీ టాస్కులో రచ్చ రచ్చ చేశారు. టెనెంట్స్, ఓనర్స్ గట్టిగానే కష్టపడ్డారు. చివరకు సంచాలక్ గా ఉన్న రీతూ చౌదరి.. ముందు నుంచి అనుకున్నట్లుగానే తన ఫ్రెండ్ డిమాన్ పవన్ ను కెప్టెన్ చేసేసింది. నువ్వు కెప్టెన్ కావాలని ముందే డిమాన్ పవన్ ను అడిగిన రీతూ.. టాస్కులో మాత్రం దగ్గరుండి కెప్టెన్ ను చేసింది. ఇక తాజాగా విడుదలైన శనివారం ప్రోమోలో రీతూతోపాటు డిమాన్ పవన్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు హోస్ట్ నాగార్జున. హౌస్మేట్స్ ముందు వీడియో ప్లే చేసి మరీ రీతూ చౌదరి ప్లానింగ్ గేమ్ ను అందరి ముందు బయటపెట్టారు. అంతేకాదు పవన్ కెప్టెనీ కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో హౌస్మేట్స్ అందరూ షాకయ్యారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున.. ఈరోజు ఎవరికి రంగు పడుద్దొ చూద్దాం అంటూ.. డిమాన్ పవన్ కెప్టెన్ కావడానికి అర్హుడా కాదా.. ? అతడు గెలిచిన తీరు కరెక్టా కాదా.. ? హౌస్ లో ఎవరికైనా అర్థమైందా అని అడగ్గా.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. స్టాప్ అని చెప్పినప్పుడు వెంటనే ఆపకపోతే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తానని ముందే రీతూ చెప్పిందని అన్నాడు. దీంతో వీడియోస్ నాగార్జున. ఈ వీక్ కెప్టెన్ అవ్వు అంటూ డిమాన్ పవన్ తో రీతూ మాట్లాడుతున్న వీడియోను అందరి ముందు ప్లే చేశారు. డిమాన్ పవన్ పేరు చెప్పింది అని నాగ్ అడగ్గానే నేనే అంటూ అసలు విషయం చెప్పేసింది. దీంతో హౌస్ మొత్తం షాకయ్యారు.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
స్టాప్ అన్న తర్వాత కూడా భరణిని నువ్వే ఎలిమినేట్ చేశావ్. తనూజ, సంజన వీళ్లందరూ చెబుతున్న కూడా వాళ్లు చెప్పింది అసలు కన్సిడర్ కూడా చేయలేదు. నువ్వు మొదటి నుంచి పవన్ కెప్టెన్ కావాలని చెబుతూనే ఉన్నావు. హౌస్ లో ఎంతమంది ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు అని అనుకుంటారని అడగ్గా.. రీతూ, పవన్ మినహా అందరూ చేతులు పైకి ఎత్తారు. దీంతో డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు చేస్తున్నట్లు చెప్పారు నాగ్..
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..