Bigg Boss 9 Telugu: తనూజకు అతడిపై క్రష్.. చికెన్ కోసం సీక్రెట్స్ చెప్పేసిన రీతూ.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్..

Bigg Boss 9 Telugu: తనూజకు అతడిపై క్రష్.. చికెన్ కోసం సీక్రెట్స్ చెప్పేసిన రీతూ.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్..


Bigg Boss 9 Telugu: తనూజకు అతడిపై క్రష్.. చికెన్ కోసం సీక్రెట్స్ చెప్పేసిన రీతూ.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్..

బిగ్‏బాస్ సీజన్ 9 మూడో వారం నడుస్తోంది. ఈ వారం నామినేషన్లలో హరీష్, ప్రియ, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతూ ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. గత రెండు వారాలు కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ మధ్య చిచ్చు పెట్టి గొడవలతో రచ్చ చేసిన బిగ్‏బాస్ ఇప్పుడు హౌస్ మెంబర్స్ సీక్రెట్స్ బయటపెట్టే పని స్టార్ట్ చేశాడు. అలాగే ఎమోషనల్ కంటెంట్ పై ఫోకస్ పెట్టాడు. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ తో ముచ్చట పెడుతూ బిజీగా ఉండిపోయింది రీతూ. దీంతో ఆమెను కన్ఫెషన్ రూంకు పిలిచాడు బిగ్ బాస్. ఆ తర్వాత అక్కడ టేబుల్ పై ఎదురుగా ఉన్న క్లాత్ తీయమన్నాడు. అందులో చికెచ్ ఉండడంతో ఏడుపు స్టార్ట్ చేసింది రీతూ. బిగ్ బాస్ చికెన్ తినొచ్చా అని అడగ్గా.. ఈ హౌస్ లో ఏదీ ఊరికే రాదు.. అది తెలుసు కదా. చికెన్ కోసం ఇంటి సభ్యుల రహస్యాలు చెప్పడానికి మీరు సిద్ధమని చెప్పడం నేను విన్నాను. నిజంగా మీరు రెడీగా ఉన్నారా అని అడిగాడు బిగ్ బాస్. హా నేను రెడీ అంటూ తలూపిన రీతూ.. ముందుగా తనూజ గురించి చెప్పుకొచ్చింది. దీంతో చికెన్ కోసం తనూజ గురించి సీక్రెట్స్ రివీల్ చేసింది రీతూ.

తనూజకు ఒక పర్సన్ అంటే ఇష్టం, క్రష్ అని తనే చెప్పింది. అలాగే కళ్యాణ్ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ లేనట్లు కనిపిస్తుంది. అది తెలిసిపోతుంది. కళ్యాణ్ దగ్గరుంటే తను కొంచెం పాజిటివ్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చికెన్ అంటే మీకు అంత ఇష్టం కాదనిపిస్తుంది అంటూ బిగ్ బాస్ అడిగాడు. చికెన్ అంటే నాకు పిచ్చి అని చెబుతుంది. ఇప్పుడు పవన్ గురించి చెప్పండి అని బిగ్ బాస్ అడగడంతో పవన్ సింగిల్ అని చెప్పాడు.. తను ఒక అమ్మాయిని లవ్ చేశానని అన్నాడు. లవ్ చేసిన అమ్మాయికి కరెక్ట్ గా ప్రపోజ్ కూడా చేయలేదు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయిందని చెప్పాడు. ఇంతవరకూ అతడు ఎవరినీ ప్రాపర్ గా లవ్ చేయలేదని చెప్పాడు.. రాగానే నా మంచి ఒపీనియన్ ఉందని చెప్పాడు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇవి సీక్రెట్స్ కాదని బిగ్ బాస్ చెప్పడంతో సాయంత్రం వరకు టైమ్ కావాలని.. ఆ లోపు అందరి గురించి తెలుసుకోని వస్తానని చెప్పడంతో సరే అన్నాడు బిగ్ బాస్. ఇక బయటకు వెళ్లగానే రీతూతో ముచ్చట్లు స్టార్ట్ చేశాడు డీమాన్ పవన్.

ఇక తర్వాత గార్డెన్ ఏరియాలో ఆపిల్ చెట్టు ముందు నిల్చోమన్నాడు. ఆ చెట్టుకు ఉండే పళ్లు కష్టం, శ్రమ ఫలితంగా తీపిగా మారాయి. మరికొన్ని ఊహించని రుచితో ఆశ్చర్యపరుస్తాయి. ఈ రెండు వారాల ఆట చూశాక ఏ ఫలం ఎవరికి దక్కాలో నేను నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులంతా మీ పేరున్న ఫలాన్ని తీసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ టాస్కులో భాగంగా ఇంటి సభ్యులకు వచ్చిన సందేశాలను జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి కూడా పోరాడాల్సి వస్తుందని చెప్పాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్ బజర్ నొక్కడంతో అతడిని కన్ఫెషన్ రూంకు పిలిచి మూడు ఆప్షన్ ఇచ్చాడు. మీ నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. అది కావాలంటే బ్యాటరీలో 45 శాతం ఖర్చు చేయాలి.. రెండోది మీ అమ్మ దగ్గరి నుంచి ఆడియో మెసేజ్ వచ్చింది. అది కావాలంటే 35 శాతం బ్యాటరీ తగ్గుతుంది. చివరగా ఫ్యామిలీ ఫోటో ఉంది. అది కావాలంటే 25 శాతం బ్యాటరీ ఖర్చు చేయాలని అడిగాడు బిగ్ బాస్. దీంతో కాస్త ఎమోషనల్ అవుతూ ఫ్యామిలీ ఫోటో సెలక్ట్ చేశాడు ఇమ్మాన్యుయేల్. దీంతో ఎపిసోడ్ ముగిసింది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *