Headlines

Bigg Boss 9 Telugu: డీమాన్ పవన్ పై సంజన సీరియస్.. నీకు అమ్మాయిలే కనిపిస్తారంటూ ఫైర్..

Bigg Boss 9 Telugu: డీమాన్ పవన్ పై సంజన సీరియస్.. నీకు అమ్మాయిలే కనిపిస్తారంటూ ఫైర్..


బిగ్‌బాస్ సీజన్ 9.. మొదటి వారం నుంచి గొడవలతోనే సాగుతుంది. ఇక గత సీజన్స్ మాదిరిగానే మరోసారి కిచెన్ లో పెద్ద రచ్చే జరిగింది. రెండోసారి కెప్టెన్ అయ్యాడు డీమాన్ పవన్. దీంతో హౌస్ లో దొంగతనం చేసినవారిని జైల్లో వేస్తానంటూ ఓవరాక్షన్ చేసాడు. దీంతో దమ్ముంటే వెయ్ అంటూ సంజన ఫైర్ అయ్యింది. ఇక తర్వాత తనకు పోపు కావాలని ఫుడ్ మానిటర్ తనూజను అడిగింది సంజన. అందుకు తనూజ ఓకే చెప్పడంతో కిచెన్ వద్దకు వెళ్లి స్టవ్ ఆన్ చేసి పోపు కావాలని చెప్పింది. దీంతో డిమాన్ నో అన్నారు. బ్రేక ఫాస్ట్ ప్రిపేర్ చేశాం కదా అంటూ వరుస ప్రశ్నలు వేశాడు. మరోవైపు దివ్య సైతం మాకు టైమ్ లేదని అన్నది. ఇక అక్కడకు వచ్చిన తనూజకు డిమాన్, దివ్య ఇద్దరూ కంప్లైయింట్ చేసారు. దీంతో తనూజ సైతం సీరియస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

చిన్న పోపు పెట్టుకోవడానికి ఇంతగా గొడవ చేయాలా అని సంజన అడగంతో డిమాన్ వెల్లుల్లి లేవు అంటూ నసిగాడు. దీంతో సంజన ఫైర్ అయ్యింది. నాకు బ్రేక్ ఫాస్ట్ వద్దు. వచ్చి పర్మిషన్ తీసుకున్నా కదా.. తినేదానికి బిక్ష వేస్తున్నారా అంటూ అరుస్తూ లోపలికి వెళ్లిపోయింది. దీంతో వెనకే వెళ్లిన డీమాన్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన తనూజ.. మరోసారి ఫుడ్ విషయం పై సంజనతో మాట్లాడింది. అక్కడ ఛాన్స్ ఉన్నప్పుడు మీకే ఇచ్చాం కదా అంటూ తనూజ చెప్పుకోచ్చింది. ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు ట్రై చేశాడు భరణి. ఇక తర్వాత కళ్యాణ్ తో మాట్లాడుతూ మరోసారి ఫిటింగ్ పెట్టాడు డీమాన్. ఆ తర్వాత సంజనకు సారీ చెప్పాడు డీమాన్ పవన్. దీంతో సంజన ఫైర్ అయ్యింది. రీతూ, తనూజ, శ్రీజ, దివ్య అడిగితే నువ్వు చేసుండేవాడివి.. నేను కాబట్టి నువ్వు నో చెప్తున్నావ్ అంటూ కన్నీళ్లు పెట్టుంది. మీరు అలా అనుకుంటున్నారు అని అన్నాడు పవన్.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

మరోవైపు ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్ బాస్ టాస్కులు పెట్టాడు. ముందుగా డీమాన్ సంచాలక్ చేసి అక్కడుకున్న 12 మందిని ఇద్దరిద్దరి చొప్పున ఆరు టీములుగా బిగ్‌బాస్ డివైడ్ చేశాడు. రెండు టీములకు ఒకసారి టాస్కు పెట్టారు. ఇందులో సుమన్ శెట్టి, దివ్య టీమ్ మాత్రమే మిగిలింది. రెండో రౌండ్ ఇమ్యూనిటీ టాస్కులో పాల్గొనేందుకు ఇద్దరిని ఎంపిక చేయాలని చెప్పగా.. తనూజ, ఫ్లోరాని సెలక్ట్ చేశారు. ఈ నలుగురికి మరో టాస్క్ పెట్టగా.. సుమన్ శెట్టి, తనూజలకు ఇమ్యూనిటీ లభించి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *