Bigg Boss 9 Telugu: కామనర్స్ నుంచి టాప్‏లో ఉండేది అతడే.. ప్రియకు షాకిచ్చిన మనీష్..

Bigg Boss 9 Telugu: కామనర్స్ నుంచి టాప్‏లో ఉండేది అతడే.. ప్రియకు షాకిచ్చిన మనీష్..


బిగ్‏బాస్ సీజన్ 9.. మొత్తం 15 మందితో ప్రారంభమైన ఈ షోలో.. ఇప్పుడు రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. సెకండ్ వీక్ మొత్తం ఏడుగురు హౌస్ లో ఉండగా.. మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో ముందుగా భరణి, హరీష్ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత సుమన్ శెట్టి, డిమాన్ పవన్, ప్రియ సేఫ్ అయ్యారు. చివరిగా డేంజర్ జోన్ లో ఫ్లోరా, మర్యాద మనీష్ మిగిలారు. వీరిద్దరిని యాక్టివిటీ ఏరియాకు పిలిచారు హోస్ట్ నాగార్జున. మీ వెనకాల ఉన్న సీతాకోక చిలుకలు చెప్తాయి. మీరు ఎలిమినేటెడా కాదా అని అన్నారు నాగ్. అయితే ముందు నుంచి ఫ్లోరా ఎలిమినేట్ కాబోతుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు ఆమె సేవ్ అయ్యి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అందరూ షాకయ్యారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

మనీష్ స్టేజ్ మీదకు రాగానే ఎలిమినేట్ అవుతానని ఊహించావా అని నాగార్జున అడగ్గా.. లేదు అని అన్నాడు మనీష్. వెళ్లేముదు టాప్ 3, బాటమ్ 3 ఎవరో చెప్పేసి వెళ్లమని అడిగారు నాగార్జున. దీంతో ముందు బాటమ్ 3లో దమ్ము శ్రీజ పేరు చెప్పాడు మనీష్. ఇప్పుడు ఆమె గేమ్ సరిగ్గా ఆడట్లేదని అన్నాడు. ఆ తర్వాత సెకండ్ బాటమ్ లో ఫ్లోరా పేరు చెప్పాడు. ఎక్కువగా పని మాత్రమే చేస్తున్నారని.. గేమ్ కనిపించట్లేదని అన్నాడు. ఇక చివరకు బాటమ్ 3లో సుమన్ శెట్టి పేరు చెప్పాడు. గేమ్ బాగా ఆడుతున్నారని.. కానీ అలా వచ్చి ఇలా వెల్లిపోతున్నారని.. అలాగే ఎవరు ఏది చెప్పినా వినేస్తున్నారని అని అన్నాడు.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఇక టాప్ 3లో ముందుగా భరణి పేరు చెప్పాడు. తన ప్రకారం నంబర్ వన్ భరణి అని అన్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పాడు. మొదట్లో ఇమ్మూని చూసి సీరియస్ గా తీసుకోలేదని.. కామెడీ మాత్రమే చేస్తారని అనుకున్నానని.. కానీ మొదటి రోజు నుంచి ఇచ్చిపడేశావన్నా అని అన్నాడు. వేరేవాళ్ల కోసం అస్సలు గేమ్ గివప్ చేయకండి అని అన్నారు. ఇక టాప్ 3లో చివరగా హరీష్ పేరు తీసుకున్నాడు. కామనర్స్ నుంచి హరీష్ మాత్రమే టాప్ 3లో ఉంటాడని చెప్పాడు. ఇక చివరగా.. అందరూ హౌస్మేట్స్ బోరింగ్ పర్సన్ ఫ్లోరా అని చెప్పడంతో ఆమె జైలుకు వెళ్లిపోతుంది. దీంతో ఆమె చేయాల్సిన వర్క్ వాష్ రూమ్స్ డ్యూటీ వేరే వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రియ ఆ వర్క్ చేయాల్సి ఉంటుందని చెబుతూ షాకిచ్చాడు మనీష్.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *