బిగ్‌బాస్ సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. మరికొన్ని గంటల్లో మరో హౌస్మేట్ బయటకు రానున్నారు. మొత్తం 15 మందితో బిగ్‌బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యింది. అందులో 9 మంది సెలబ్రెటీస్ కాగా.. ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది. తాజాగా శనివారం హోస్ట్ నాగార్జున హౌస్మేట్స్ కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం మొత్తం హౌస్మేట్స్ చేసిన మీస్టెక్స్ వీడియోస్ చూపించి మరీ ఊతికారేశారు నాగ్. ఇక ఆదివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.
రెండో వారం మొత్తం ఏడుగురు హౌస్మేట్స్ నామినేషన్ లో ఉన్నారు. భరణి, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ నామినేట్ అయ్యారు. అయితే ఆన్ లైన్ సమాచారం ప్రకారం వీరిలో భరణి, సుమన్ శెట్టి ఓటింగ్ లో దూసుకుపోతున్నారు. సుమాన్ శెట్టి అమాయకత్వం.. నిజాయితీకి అడియన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ఓటింగ్ లో అతడు టాప్ లో దూసుకుపోతున్నారు. ఇక భరణి, డీమాన్ పవన్, ఫ్లోరా షైనీ, హరిత హరీష్ కు సైతం ఓటింగ్ పాజిటివ్ గానే వచ్చినట్లు సమాచారం.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రెండో వారం డేంజర్ జోన్ లో ఇద్దరు కామనర్స్ ఉన్నారు. ప్రియా, మర్యాద మనీష్ ఇద్దరు డేంజర్ డోన్ లో ఉన్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం వీరిద్దరిలో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ముందు నుంచి రెండోవారం ఎలిమినేషన్ కామనర్స్ నుంచి ఉంటుందని అంతా భావించారు. అయితే హరిత హరీష్ ఎలిమినేట్ కాబోతున్నారని టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రియా ఎలిమినేట్ అయ్యిందంటూ ప్రచారం సాగింది. కానీ చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..