
ఈ మధ్యకాలంలో నేరాలు ఎలా పెరిగిపోతున్నాయో.. బలవన్మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో కొంతమంది తమ జీవితాలను అర్థాంతరంగా చాలిస్తున్నారు. కుటుంబ కలహాలతో కొంతమంది, అప్పుల బాధతో మరి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే కొంతమంది ఆత్మహత్యలకు కారణాలు చాలా చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా ఓ బ్యాంక్ మేనేజర్ తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవంటూనే చావు తనను పిలిస్తోందంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన బీబీ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామంతాపూర్ కు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ బర్ల సురేంద్ర శుక్రవారం బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గత పది రోజులుగా మనస్తాపంతో బాధపడుతున్న ఆయన, ఆర్థిక సమస్యలు లేవని ఆడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మరణం తట్టుకోలేక అదే చెరువులో దూకిన ఆయన భార్య సంధ్యారాణిని పోలీసులు, స్థానికులు కాపాడారు. కాగా సురేంద్ర ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి