Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న సంక్రాంతి సూపర్ హిట్.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న సంక్రాంతి సూపర్ హిట్.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ ఎక్కడంటే..


Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న సంక్రాంతి సూపర్ హిట్.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మాస్ మహారాజా రవితేజ బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఇరుముడి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రవితేజ ప్రధాన పాత్రలో నటించగా.. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా అలరించారు. ఇందులో సునీల్, సత్య, మురళీధర్ గౌడ, రోహన్, సోనియా సింగ్ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి పండక్కి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 40 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం 30 కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్

ఇదిలా ఉంటే సంక్రాంతి విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. మార్చి 13 నుంచి ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. విడుదలైన రెండు నెలలకు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

కథ విషయానికి వస్తే.. రామ సత్యనారాయణ (రవితేజ) ఓ వైన్ యార్ట్ ఓనర్. కొత్తగా రెడీ చేసిన అనార్కలి వైన్ ను స్పెయిన్ లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్ చేస్తారు. కారణం తెలుసుకోవడానికి వెళ్లిన రామ్.. అక్కడే వర్క్ చేస్తున్న ఎండీ మానసా శెట్టితో ఫిజికల్ గా దగ్గరవుతాడు. అప్పటికే పెళ్లైన రామ సత్యనారాయణ తన భార్య బాలామణి (డింపుల్ హయతి) దగ్గర సీక్రెట్ గా ఉంచుతాడు. ఆ తర్వాత రామ సత్యనారాయణ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *