Best Mobiles: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే..

Best Mobiles: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే..


ఫెస్టివల్ సేల్స్ సమయంలో రూ. 20 వేల బడ్జెట్ లో ఉండే మొబైల్స్ రెండు మూడు వేలు తగ్గి రూ. 15 వేల బడ్జెట్ లోకి వస్తాయి. అందుకే బడ్జెట్ మొబైల్ కొనడానికి ఇదే బెస్ట్ టైం. రూ. 15 వేల సెగ్మెంట్ లో ప్రజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్స్ లిస్ట్ చూస్తే..

ఒప్పో కె13ఎక్స్ 5జీ (OPPO K13x 5G): ధర రూ. 9,499.

ఒప్పో కె13ఎక్స్ 5జీ మొబైల్లో 6.67 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్ ప్లే ఉంటుంది.  120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉంటుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది.

పోకో ఎం7 ప్లస్ 5జీ (Poco M7 Plus 5G): ధర రూ. 10,999.

పోకో ఎం7 ప్లస్ 5జీ మొబైల్ లో  6.9 అంగుళాల ఎల్‌సీడీ డిస్ ప్లే.. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది.

రెడ్ మీ నోట్ 14 ఎస్ ఈ 5జీ  (Redmi Note 14 Se 5G): ధర రూ. 11,499.

రెడ్ మీ నోట్ 14 ఎస్ ఈ 5జీలో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్ ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ , 2ఎంపీ సెకండరీ కెమెరాలు ఉంటాయి.  5110 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్17 5జీ (Samsung f 17 5g): ధర రూ. 14,499.

శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్17 5జీ  మొబైల్ లో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 50 ఎంపీ+5ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్ తో వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

రియల్ మీ 13 5జీ (Realme 13 5G ):  ధర రూ.14,990.

రియల్ మీ 13 5జీ  మొబైల్ లో  6.72 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది.  5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది.

మోటరోలా జీ86 పవర్ 5జీ  (Moto g86 power 5g): ధర రూ. 15,999.

మోటరోలా జీ86 పవర్ 5జీ మొబైల్ లో  6.7 పీ-ఓలెడ్‌ డిస్ ప్లే ఉంటుంది.  120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. 50ఎంపీ+8ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 6720 ఎంఏహెచ్‌  ఉంటుంది.

నథింగ్ సీఎంఎఫ్ 2 ప్రో (Nothing CMF 2 Pro): ధర రూ. 15,999.

సీఎంఎఫ్  2 ప్రో ఫోన్ లో 6.77 ఇంచ్ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో  50ఎంపీ +50 ఎంపీ+8 ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది.  5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

ఐకూ జెడ్ 10 ఎక్స్ (iQOO Z10x):  ధర రూ. 13,499

ఐకూ జెడ్ 10 ఎక్స్ లో 6.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్ ప్లే ..120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. 50 ఎంపీ+2 ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. 6500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *