Bank Holidays: నవరాత్రి, పండుగల కారణంగా దేశంలో వరుసగా 10 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. సెప్టెంబర్ నెల ముగియబోతోంది. అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్కరూ నవరాత్రి పండుగను జరుపుకుంటున్నారు. నవరాత్రి, వచ్చే నెలలో జరిగే పండుగల కారణంగా బ్యాంకులు ఇప్పుడు వరుసగా 10 రోజులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజులలో ఉంటాయి. సెప్టెంబర్-అక్టోబర్ 2025 పండుగల నెల. వీటిలో దసరా, దీపావళి, ఛత్ పూజ, దుర్గా పూజ వంటి ప్రధాన పండుగలు ఉన్నాయి. అందువల్ల అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 2025 కోసం బ్యాంకు సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. అయితే ఈ సెలవులు బ్యాంకు నిమిత్తం పనులు చేసుకునేవారికి మాత్రమే ప్రభావితం చేస్తాయి. వినియోగదారులు మునుపటిలా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాల ప్రాముఖ్యతను బట్టి సెలవులు ఉంటాయి.
ఇది కూడా చదవండి: RBI New Rules: ఆర్‌బిఐ కీలక నిర్ణయం.. ఇక బ్యాంకులు 15 రోజుల్లోగా పరిష్కరించాలి.. లేకుంటే కస్టమర్లకు పరిహారం చెల్లించాల్సిందే!
సెప్టెంబర్ నెలలో సెలవులు: సెప్టెంబర్ 29 (సోమవారం): అగర్తల, గాంగ్టక్, కోల్‌కతాలో మహా సప్తమి లేదా దుర్గా పూజ. దీని కారణంగా బ్యాంకులకు సెలవు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 30 (మంగళవారం): అగర్తల, భువనేశ్వర్, గౌహతి, కోల్‌కతా, పాట్నా, రాంచీలతో సహా అనేక నగరాల్లో మహా అష్టమి/దుర్గా అష్టమి సందర్భంగా బ్యాంకులు బంద్.
వారపు సెలవులు:
- సెప్టెంబర్ 27 (నాల్గవ శనివారం)
- సెప్టెంబర్ 28 (ఆదివారం)
- అక్టోబర్ 5 (ఆదివారం)
- అక్టోబర్ 1, 2025: విజయదశమి (దసరా), ఆయుధ పూజ, దుర్గాపూజల కోసం ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవుదినం త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మేఘాలయలకు వర్తిస్తుంది.
- అక్టోబర్ 2, 2025: మహాత్మా గాంధీ జయంతి దేశవ్యాప్తంగా జాతీయ సెలవుదినం అవుతుంది. ఈ రోజున అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
- అక్టోబర్ 3, 4, 2025: సిక్కింలో దుర్గా పూజ కారణంగా ఈ రెండు రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
- అక్టోబర్ 6, 2025: త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లలో లక్ష్మీ పూజ సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
- అక్టోబర్ 7, 2025: కర్ణాటక, ఒడిశా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయి. మహర్షి వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ ఇక్కడ జరుపుకుంటారు. మొత్తంమీద అక్టోబర్‌లో అనేక రాష్ట్ర-నిర్దిష్ట సెలవులు ఉంటాయి. పండుగల సమయంలో అసౌకర్యాన్ని నివారించడానికి వినియోగదారులు ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని నిర్ధారించుకోవాలి. ఈ తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు ఆఫ్‌లైన్‌లో ఉండవు.
ఇది కూడా చదవండి: Speed Post: పోస్టల్ వినియోగదారులకు అలర్ట్.. ఇక స్పీడ్ పోస్ట్ డెలివరీలో కీలక మార్పులు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి