AUS vs IND: గబ్బాలో గాడ్రించిన యువ భారత్.. మరోసారి ఆసీస్ గర్వాన్ని దెబ్బతీశారుగా..

AUS vs IND: గబ్బాలో గాడ్రించిన యువ భారత్.. మరోసారి ఆసీస్ గర్వాన్ని దెబ్బతీశారుగా..


Australia U19 vs India U19, 1st Youth ODI: గబ్బాలో ఆస్ట్రేలియా గర్వాన్ని మరోసారి టీమిండియా దెబ్బతీసింది. కానీ ఈసారి ఆ ఘనతను సాధించింది మన జూనియర్ జట్టు ఇండియా. బ్రిస్బేన్‌లో (సెప్టెంబర్ 21, 2025) జరిగిన తొలి యూత్ వన్డేలో భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియా అండర్-19 జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో, భారత జట్టు సిరీస్‌ను బలంగా ప్రారంభించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు చేసింది. దానికి సమాధానంగా, భారత అండర్-19 జట్టు కేవలం 30.3 ఓవర్లలో 227/3 స్కోరు చేసి లక్ష్యాన్ని చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయంలో అతిపెద్ద హీరో అభిజ్ఞాన్ కుండు. అతనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అతను 87 పరుగులు (74 బంతుల్లో) చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫీల్డ్‌లో రెండు క్యాచ్‌లు కూడా తీసుకున్నాడు. అతని బలమైన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ఈ విజయంలో భారత బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడారు. 117 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇది జట్టు బలమైన ఫామ్‌కు నిదర్శనం.

ఇవి కూడా చదవండి

భారత పరుగుల వేటకు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. అతను 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో సహా 38 పరుగులు చేశాడు. వైభవ్ బ్యాటింగ్ భారత జట్టు కేవలం 5 ఓవర్లలో 50 పరుగులు సాధించడంలో సహాయపడింది.

వేదాంత్ త్రివేది 69 బంతుల్లో 61 పరుగులు చేశాడు. వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ అభిజ్ఞాన్ కుండు 74 బంతుల్లో 87 పరుగులు చేశాడు. వేదాంత్, అభిజ్ఞాన్ అజేయంగా నిలిచారు.

అంతకుముందు, భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆస్ట్రేలియన్ అండర్-19 జట్టును 50 ఓవర్లలో 225/9కి కట్టడి చేశారు. జాన్ జేమ్స్ 68 బంతుల్లో 77 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

భారత జట్టు తరపున హెనిల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, కిషన్ కుమార్, కనిష్క్ చౌహాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆర్ఎస్ అంబ్రిస్ కూడా ఒక వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య తదుపరి రెండు యూత్ వన్డేలు సెప్టెంబర్ 24, 26 తేదీలలో బ్రిస్బేన్‌లో జరుగుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *