మనలో చాలా మంది ATM నుండి డబ్బు తీసుకునేటప్పుడు ఒక్కసారైనా డబ్బులు మెషిన్‌లో ఇరుక్కుపోయిన అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. అదే కాకుండా కొన్నిసార్లు మనం ఎంటర్ చేసిన అమౌంట్ కన్నా తక్కువ డబ్బు కూడా వస్తుంది. కొన్నిసార్లు మొత్తం డబ్బు నిలిచిపోతుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం కొన్ని సార్లు బ్యాంక్ సర్వర్లు అయితే, ఏటీఎం మిషన్లలో సాంకేతిక తోపం మరో కారణం. ఇలాంటి మీ డబ్బు ఏటీఎంలో ఇరుక్కుపోయినప్పుడు టెన్షన్ పడకుండా దాన్ని మీరు తిరిగి ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఏటీఎంలో డబ్బు ఇరుక్కుంటే ఏం చేయాలి?
మీ డబ్బు ఏటీఎంలో ఇరుక్కుపోయి, అది మీకు చేతికి రాకుండా మళ్లీ మెషిన్‌లోకి వెళ్లిపోయి.. మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అయితే.. మీరు ఏటీఎం నుంచి ట్రాన్సాక్షన్ రిపిష్ట్‌ను తీసుకోండి. ఒక వేళ మీ దగ్గర రిపిప్ట్ లేకపోయినా, మీకు వచ్చిన SMS లేదా బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను ఉపయోగించి బ్యాంక్‌లో ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు తర్వాత 24 గంటల్లోపు డబ్బు తిరిగి ఇవ్వకపోతే, మీరు వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయండి.
ఫిర్యాదు చేసేందుకు అవసరమైన వివరాలు
- మీ డబ్బు ఏ ATMలో ఇరుక్కుపోయిందో దాని లోకేషన్
- మీరు డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం
- మీరు ATM నుంచి తీసుకున్న ట్రాన్సాక్షన్ రిసిప్ట్, లేదా SMS వివరాలు
ఫిర్యాదు ఎలా చేయాలి?
మీరు ATM వద్ద ఏదైనా ఎర్రర్ సందేశాన్ని చూసినట్లయితే, దానిని ఫోటో తీయండి. దాన్ని మీరు ఫిర్యాదు చేసే ఫామ్‌తో జోడించండి. మీరు కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు మీపంలోని బ్యాంకు శాఖలో లిఖితపూర్వక ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. అలా కాకుండా మీరు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
అయితే సాధారణంగా, ఇటువంటి సమస్యలు 7 నుండి 10 రోజుల్లో పరిష్కరించబడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, బ్యాంకులు 45 రోజుల్లోపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. గడువు తర్వాత కూడా డబ్బు తిరిగి రాకపోతే, బ్యాంకులు వడ్డీతో సహా ఆ మొత్తాన్ని కస్టమర్‌కు తిరిగి ఇవ్వాలి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.