Astro Tips: ఏలినాటి శనితో బాధపడుతున్నారా.. మంగళ, శనివారం ఈ పరిహారాలు చేయండి.. సవాళ్లు అధిగమిస్తారు

Astro Tips: ఏలినాటి శనితో బాధపడుతున్నారా.. మంగళ, శనివారం ఈ పరిహారాలు చేయండి.. సవాళ్లు అధిగమిస్తారు


Astro Tips: ఏలినాటి శనితో బాధపడుతున్నారా.. మంగళ, శనివారం ఈ పరిహారాలు చేయండి.. సవాళ్లు అధిగమిస్తారు

జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మ ఫలదాతగా పరిగణిస్తారు. శని ప్రభావం జీవితంలో ఒడిదుడుకులు, పరీక్షలను తెస్తుంది. ఎవరైనా ఏలి నాటి శని బారిన పడినప్పుడు వారు ఇబ్బందులు.. ఆరోగ్య సమస్యలు , మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే సరైన నివారణలు, సకాలంలో పూజలను చేయడం వలన శనీశ్వరుడి వలన కలిగే ఇబ్బందికరమైన ప్రభావాలను తగ్గించవచ్చు. ఈ రోజు జ్యోతిషశాస్త్ర నివారణల గురించి తెలుసుకుందాం.

ఏలినాటి శని అంటే ఏమిటి?

జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడు నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. ఒక రాశిలోని మొదటి, రెండవ,పన్నెండవ ఇళ్లలో శని సంచరిస్తే.. ఆ కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఇది మూడు రాశులను ఒకేసారి ప్రభావితం చేస్తుంది. దీని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి కెరీర్ లో అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు , ఆర్థిక ఇబ్బందులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని నమ్మకం.

ఏలినాటి శని ప్రభావాలను తగ్గించే పరిహారాలు

ఏలినాటి శని ప్రతికూల ప్రభావాలను తగ్గించగల కొన్ని పరిహారాలను జ్యోతిషశాస్త్రం సూచించింది. మంగళ, శనివారాల్లో ఈ పరిహారాలు చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

మంగళవారం చేయాల్సిన పరిహారాలు

  1. శనిశ్వరుడి స్నేహితుడిగా పరిగణించబడే హనుమంతుడికి మంగళవారం అంకితం చేయబడింది. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. అటువంటి వ్యక్తులపై శని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.
  2. హనుమాన్ చాలీసా పారాయణం: మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత.. కనీసం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
  3. సుందరకాండ పారాయణం: వీలైతే మంగళవారం నాడు సుందరకాండ పారాయణం చేయండి. ఈ పరిహారం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.
  4. హనుమంతుడికి వీటిని సమర్పించండి : మంగళవారం నాడు.. హనుమాన్ ఆలయానికి వెళ్లి శనగలు, సింధూరం, మల్లె నూనెను సమర్పించండి.
  5. హనుమంతుడికి ప్రసాదంగా బూందీ ప్రసాదాన్ని అందించండి. ఈ ప్రసాదాన్ని పేదలకు పంచండి.

శనివారం చేయాల్సిన పరిహారాలు

  1. హిందూ మతంలో శనివారం శనిదేవుడికి అంకితం చేయబడింది. ఈ రోజున చేసే పరిహారాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
  2. శనీశ్వర ఆలయాన్ని సందర్శించండి : శనివారం శనీశ్వర ఆలయాన్ని సందర్శించి.. శనిదేవుడికి ఆవాల నూనె, నల్ల నువ్వులు సమర్పించండి.
  3. రావి చెట్టుకి పూజ: శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
  4. నల్ల వస్తువులను దానం చేయండి: శనివారం నాడు పేదలకు, ఆపన్నులకు మినప పప్పు, నల్ల నువ్వులు, ఆవాల నూనె, దుప్పట్లు లేదా బూట్లు దానం చేయండి.
  5. శని స్తోత్ర పారాయణం: శని స్తోత్రం, దశరధుని శని స్తోత్రాన్ని శనివారం పఠించడం కూడా గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది.
  6. ఆహారాన్ని దానం చేయండి: శనివారం నాడు పేదవాడికి లేదా బిచ్చగాళ్ళకు అన్నదానం చేయండి. ఈ పరిహారం శనిదేవుడికి చాలా ప్రియమైనది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *