Asia Cup Final 2025: ఆసియా కప్‌లో పాక్‌పై కేవలం ఒక్క పరుగు.. కట్ చేస్తే.. టీమిండియాకి చీతా థండర్.. ఎవరంటే.?

Asia Cup Final 2025: ఆసియా కప్‌లో పాక్‌పై కేవలం ఒక్క పరుగు.. కట్ చేస్తే.. టీమిండియాకి చీతా థండర్.. ఎవరంటే.?


వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అక్కడ అతను భారత అండర్ 19 జట్టు తరపున ఆడిన 3 వన్డే మ్యాచ్‌లలో కేవలం 124 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్ లో మాత్రమే అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. కానీ, వైభవ్ సూర్యవంశీ ఏ జట్టుతో, ఏ టోర్నమెంట్‌లో అండర్ 19 భారత జట్టు తరపున వైట్ బాల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడో మీకు తెలుసా? అతడు UAE వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్‌ మ్యాచ్ తో వైట్ బాల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. గత సంవత్సరం దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అండర్ 19 ఆసియా కప్‌లో వైభవ్ సూర్యవంశీ తన మొదటి వైట్ బాల్ మ్యాచ్ ఆడాడు.

వైట్ బాల్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డు

పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రతీ అంశంలోనూ నెంబర్ వన్ గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ భారత అండర్-19 జట్టు తరపున ఇంకా ఒక్క T20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటిదాకా 11 ODIలు ఆడిన వైభవ్.. ఒక సెంచరీతో 556 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 43 సిక్సర్లు, 50 ఫోర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 151.91, బ్యాటింగ్ సగటు 50.54గా ఉంది.

పాకిస్తాన్‌పై ప్రతి విషయంలోనూ నెంబర్ 1..

ఆ 11 మ్యాచ్‌ల్లో చేసిన 556 పరుగులలో వైభవ్ సూర్యవంశీ పాకిస్తాన్‌పై ఎన్ని పరుగులు చేశాడంటే.. ఎన్ని మ్యాచ్‌లు ఆడాడో తెలుసా.? అతను గత సంవత్సరం ఆసియా కప్‌లో అండర్-19 వన్డే అరంగేట్రం చేశాడు. ఇది ఇప్పటివరకు అతను పాకిస్తాన్‌తో ఆడిన ఏకైక మ్యాచ్. పాకిస్తాన్‌తో జరిగిన ఆ ఒకే ఒక్క మ్యాచ్‌లో అతను కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. అతని బ్యాటింగ్ సగటు కూడా 1. అండర్ 19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఆ తొలి మ్యాచ్ తర్వాత.. వైభవ్ సూర్యవంశీ అండర్ 19 వన్డే క్రికెట్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *