Asia Cup Final : తిలక్ వర్మ సిక్స్‌కు గంభీర్ ఆగ్రహం, ఆనందం.. తన రియాక్షన్ వీడియో చూశారా ?

Asia Cup Final : తిలక్ వర్మ సిక్స్‌కు గంభీర్ ఆగ్రహం, ఆనందం.. తన రియాక్షన్ వీడియో చూశారా ?


Asia Cup Final : భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ చారిత్రాత్మక విజయంలో కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ భారత జట్టుకు హీరోలుగా నిలిచారు. కుల్దీప్ బౌలింగ్‌లో 4 వికెట్లు తీయగా, తిలక్ వర్మ ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో అజేయంగా 69 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో వారి ప్రదర్శనతో పాటు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తన రియాక్షన్లతో వార్తల్లో నిలిచారు.

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మైదానం వెలుపల ఉండి కూడా మ్యాచ్‌తో భావోద్వేగంగా ముడిపడి ఉంటారు. చివరి ఓవర్‌లో టీమిండియాకు గెలవడానికి 10 పరుగులు అవసరమయ్యాయి. హారిస్ రౌఫ్ వేసిన ఓవర్ మొదటి బంతికి 2 పరుగులు వచ్చాయి. రౌఫ్ వేసిన రెండో బంతికి తిలక్ వర్మ భారీ సిక్స్ కొట్టడంతో, గౌతమ్ గంభీర్ తన కుర్చీలో కూర్చున్న చోటు నుంచే పెద్దగా టేబుల్‌ను కొట్టడం మొదలుపెట్టాడు. ఈ సిక్స్ భారత జట్టు విజయాన్ని దాదాపు ఖరారు చేసింది.

తిలక్ వర్మ కొట్టిన ఈ సిక్స్ తర్వాత మిగిలిన పనిని రింకూ సింగ్ పూర్తి చేశాడు. అతను బౌండరీ కొట్టి భారత్ తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ విజయాన్ని ఖరారు చేశాడు. గౌతమ్ గంభీర్ ఇంత ఉత్సాహంగా స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓవల్ టెస్ట్‌లో భారత్ అద్భుత విజయం సాధించినప్పుడు కూడా గౌతమ్ గంభీర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

మొత్తంగా చూస్తే.. తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ ఫైనల్‌లో భారత్ తరపున మ్యాచ్-విన్నింగ్ ప్రదర్శన కనబరిచారు. అయితే, ఈ విక్టరీ క్రెడిట్ సంజూ శాంసన్, తిలక్ వర్మ మధ్య జరిగిన 57 పరుగుల భాగస్వామ్యానికే దక్కాలి. భారత జట్టు 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్ చేరారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సంజు శాంసన్, తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను మ్యాచ్‌లోకి తిరిగి తీసుకొచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *