Asia Cup 2025: ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఆ మ్యాచ్ కు ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై వచ్చిన ఆరోపణల విచారణ పూర్తయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఫిర్యాదు తర్వాత ICC ఈ ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి, సెప్టెంబర్ 14న ఆసియా కప్ లో పాకిస్థాన్ పై విజయం సాధించిన తర్వాత, సూర్యకుమార్ ఈ మ్యాచ్ ను ఆపరేషన్ సిందూర్ లో భాగమైన భారత సాయుధ దళాలకు, పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు అంకితం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా PCB దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని “రాజకీయ ప్రకటన” అని పేర్కొంది. దీనిపై కూడా ఫిర్యాదు చేసింది.