Asia Cup 2025 : ఫస్ట్ బంతికే సిక్సర్..కుళ్లుకున్న షాహిన్ అఫ్రిది.. మరి గిల్ ఊరికే ఉంటాడా..ఆ తర్వాత ఏం జరిగిందంటే

Asia Cup 2025 : ఫస్ట్ బంతికే సిక్సర్..కుళ్లుకున్న షాహిన్ అఫ్రిది.. మరి గిల్ ఊరికే ఉంటాడా..ఆ తర్వాత ఏం జరిగిందంటే


Asia Cup 2025 : భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లలో ఆటగాళ్ల మధ్య వాడి వేడి వాతావరణం ఉండటం సర్వసాధారణం. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో కూడా అలాంటి సన్నివేశమే కనిపించింది. పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది, భారత ఓపెనర్ శుభమన్ గిల్‌తో ఘర్షణకు దిగాడు. అయితే, భారత బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ అతనికి తొలి బంతికే సిక్సర్ కొట్టి గట్టి సమాధానం ఇచ్చారు.

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. పాకిస్తాన్ ప్రధాన బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వీరు ఆడిన తీరు పాకిస్తాన్ జట్టుకు కోపం తెప్పించింది.

సాధారణంగా షాహీన్ అఫ్రిది మొదటి ఓవర్‌లోనే వికెట్లు తీయడంలో ప్రసిద్ధి. అయితే, ఈసారి అతని బౌలింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ తొలి బంతికే ఒక భారీ సిక్సర్ కొట్టాడు. అఫ్రిది వేసిన బౌన్సర్ బంతిని అద్భుతమైన పుల్ షాట్‌తో బౌండరీ అవతలికి పంపించాడు. ఇది అఫ్రిదికి షాక్ ఇవ్వడమే కాకుండా, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను ఉత్సాహపరిచింది.

అభిషేక్ శర్మ చేతిలో దెబ్బతిన్న షాహీన్ అఫ్రిది, ఆ తర్వాత ఓవర్‌లో శుభమన్ గిల్పై ఒత్తిడి పెంచాలని చూశాడు. కానీ, గిల్ అతని నాలుగో, ఆరో బంతులకు రెండు ఫోర్లు కొట్టి సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహం చెందిన అఫ్రిది, గిల్‌తో ఏదో గొడవకు దిగాడు. అందుకు స్పందనగా గిల్, బంతి వెళ్ళిన బౌండరీ వైపు చూపించి, తన బ్యాటింగ్ సత్తా ఏంటో అఫ్రిదికి చెప్పాడు. ఇది 1996లో ఆమిర్ సోహెల్, వెంకటేశ్ ప్రసాద్ మధ్య జరిగిన సంఘటనను గుర్తు చేసింది.

ఈ ఇద్దరు భారత ఓపెనర్లు పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్‌ప్లేలో ఇద్దరూ కలిసి కేవలం 28 బంతుల్లోనే జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పారు. అతి తక్కువ బంతుల్లో (331 బంతుల్లో) 50 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు ఎవిన్ లూయిస్ (366 బంతులు) పేరిట ఉండేది. ఈ ఇద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో టీమిండియా సులభంగా విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *