ఆసియా కప్ 2025లో భాగంగా నేడు(ఆదివారం) భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తతలు, భారీ అంచనాల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, పాక్‌ను రెండు సార్లు చిత్తుగా ఓడించింది. గ్రూప్‌లో ఒకసారి, సూపర్ ఫోర్ దశలో పాక్, టీమిండియా చేతిలో ఓటమి పాలైంది. ఫైనల్లో ఓడించి.. ఆ రెండు ఓటములకు బదులు తీర్చుకోవాలని ఆశపడుతోంది.
కానీ, టీమిండియా మాత్రం పాక్‌కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా హ్యాట్రిక్ కొట్టడంతో పాటు కప్పు కూడా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇంత ఇంట్రెస్టింగ్ అంశాల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌ను థియేటర్లలో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నట్లు పీవీఆర్ సంస్థ ప్రకటించింది. కానీ, తాజాగా ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను క్యాన్సల్ చేసినట్లు ప్రకటించింది.
శివసేన-యుబిటి వ్యతిరేకత నేపథ్యంలో ముంబై, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే నిర్ణయాన్ని పివిఆర్ ఐనాక్స్ రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు ఉద్ధవ్ థాకరే పార్టీ ఆదివారం తెలియజేసింది. ఉద్ధవ్ సేన ఒక ఎక్స్‌లో పార్టీ నాయకుడు అఖిల్ చిత్రే విజ్ఞప్తి మేరకు PVR యాజమాన్యం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అన్ని ప్రదర్శనలను రద్దు చేసిందని పేర్కొన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి