ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో పాక్‌ను ఏకంగా మూడు సార్లు మట్టికరిపించింది భారత్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన టోర్నీ కావడంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ టోర్నీ జరిగింది. మొత్తంగా పాక్‌ను మూడు సార్లు చిత్తు చేసింది సూర్య సేన. ఫైనల్ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ఓ పాక్ బౌలర్ పరువుతీశాడు. టీమిండియాకు అతనో రన్ మెషీన్లా మారాడంటూ ఎద్దేవా చేశాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరు? అక్రమ్ ఎందుకలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..
ఆసియా కప్ సూపర్4లో టీమ్ఇండియాతో పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో అనుచిత ప్రవర్తనతో పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం రౌఫ్ చెత్త బౌలింగ్ చేశాడు. కేవలం 3.5 ఓవరల్లోనే ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్.. హారిస్ రవూఫ్‌ను కడిగి పారేశాడు. కీలకమైన పోరులో భారీగా పరుగులు సమర్పించుకున్నాడని విమర్శించాడు. దురదృష్టవశాత్తూ హారిస్ రవూఫ్ బౌలర్‌గా రన్‌మెషీన్. ముఖ్యంగా అతడు టీమ్ఇండియా అనగానే భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు అని ఎద్దేవా చేశాడు.
అలాగే పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీ కూడా సరిగా లేదని వసీమ్ అక్రమ్ అన్నాడు. అతడి నిర్ణయాలూ కూడా ఓటమికి కారణమని విమర్శించాడు. అలాగే అతడు పీసీబీకి కూడా ఈ విషయమై పలు సూచనలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్ ఆడకపోవడం వల్ల రవూఫ్‌కు బంతిమీద నియంత్రణ ఉండటం లేదు. పీసీబీ ఈ విషయంలో పునరాలోచించాలి. రెడ్ బాల్ క్రికెట్ ఆడకుంటే ఎంతటి ఆటగాడిని అయినా సాగనంపాలి’ అని వసీమ్ అక్రమ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి