
వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల యూజర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి పోటీగా మనదేశం నుంచి ఓ కొత్త యాప్ రిలీజైంది. అదే అరట్టై. చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ ఈ యాప్ ను రూపొందించింది. ప్రస్తుతం ఈ యాప్ ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో సోషల్ నెట్వర్కింగ్ విభాగంలో నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఈ యాప్‌ను ప్రోత్సహించాలంటూ పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్ తెగ వైరల్ అవుతుంది.
స్వదేశీ టెక్నాలజీ
టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా ‘జోహో’ సంస్థ ఈ అరట్టై యాప్‌ను డెవలప్ చేసింది. ఇందుల యూజర్స్ ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. యూజర్ల డేటా అంతా పూర్తిగా భారతదేశంలోనే సురక్షితంగా ఉంటుందని కంపెనీ చెప్తోంది. ప్రస్తుతానికి అరట్టై యాప్‌లో కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. మెసేజులకు కూడా త్వరలో ఎన్ క్రిప్షన్ సదుపాయాన్ని తీసుకొస్తామని చెప్తు్న్నారు.
ఫీచర్స్ ఇవే..
అరట్టై అంటే తమిళ్ లో మాట్లాడుకోవడం అని అర్థం. ఇందులో వాట్సాప్ లాగానే టెక్స్ట్ మెసేజులు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. ఇలా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. స్పష్టమైన క్వాలిటీతో వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వార్తలు, ఇతర సమాచారం కోసం ఛానెల్స్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇండియాలోని అన్ని లోకల్ లాంగ్వేజెస్ లో ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ఇంటర్ ఫేస్ కూడా అచ్చం వాట్సాప్ ను పోలి ఉంటుంది. త్వరలోనే ఈ యాప్ లో మరిన్ని అప్ డేట్స్ వస్తాయని, తక్కువ కాలంలోనే దీన్ని వాట్సా్ప్ కు ప్రత్యామ్యాయంగా మారుస్తామని జోహో సంస్థ చెప్తోంది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..