AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!


AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని, మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని అంచనా వేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో భానుడి భగభగలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎండల తీవ్రత మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించింది. మార్చి నుంచి మే మధ్య కాలంలో ఎండలు అత్యంత ప్రమాదకరంగా మారనున్న నేపథ్యంలో, మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు తగ్గించుకోవాలని, తగినంత నీరు తాగుతూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..

ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?

మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌

NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌

Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *