డెస్క్ టాప్స్ లేదా ల్యాప్ టాప్స్ వాడేవాళ్లకు వైరస్ అనేది పెద్ద ప్రాబ్లమ్ గా ఉంటుంది. పైగా ఈ మధ్యకాలంలో మాల్వేర్స్, ర్యాన్ సమ్ వేర్ ఎటాక్స్ ఎక్కువ అయ్యాయి. ఏదైనా ఫేక్ వెబ్ సైట్ నుంచి ఫైల్స్ డౌన్ లోడ్ అయినప్పుడు లేదా అన్ ప్రొటెక్టెడ్ ఇంటర్నెట్ తో పీసీని కనెక్ట్ చేసినప్పుడు లేదా పెన్ డ్రైవ్ ల వంటివి కనెక్ట్ చేసినప్పుడు ఇలాంటి మాల్వేర్స్ ఎంటర్ అవుతుంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు చాలామంది యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ వాడుతుంటారు. అయితే డబ్బు పెట్టి సాఫ్ట్ వేర్స్ కొనే అవసరం లేకుండా సిస్టమ్ ల ఇన్ బిల్ట్ గా వచ్చే టూల్స్ తో కూడా మాల్వేర్స్ పని పట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
డిఫెండర్ ఫైర్‌వాల్
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడేవాళ్లకు ఓఎస్‌లో ఇన్‌బిల్ట్‌గా ‘విండోస్ డిఫెండర్ ఫైర్‌వాల్’ అనే టూల్ ఉంటుంది. ఇది మాల్వేర్, వైరస్‌లను స్కాన్ చేస్తూ పీసీని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. అయితే ఇది డిజేబుల్ లో ఉంటే ప్రొటెక్షన్ పని చేయదు. కాబట్టి దీన్ని ఎనేబుల్ లో ఉంచుకోవాలి. విండోస్ బటన్ నొక్కి, సెర్చ్ బాక్స్ లో ‘డిఫెండర్’ అని టైప్ చేస్తే.. డిఫెండర్ టూల్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అక్కడ ‘వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్’ లోకి వెళ్లాలి. అక్కడ సెటింగ్స్‌లోకి వెళ్లి ‘మ్యానేజ్ సెటింగ్స్’ లో ‘రియల్-టైమ్ ప్రొటెక్షన్’ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా డిఫెండర్ టూల్ ఎప్పటికప్పుడు పీసీని స్కాన్ చేస్తూ, మాల్వేర్స్ ఎంటర్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇస్తుంది.
డిస్క్ క్లీనప్
పీసీలో ఉండే క్యాచీ ఫైల్స్ లేదా టెంపరరీ ఫైల్స్‌లో కొన్నిసార్లు మాల్వేర్స్ దాక్కుని ఉండే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు సిస్టమ్ లోని డ్రైవ్ ను క్లీనప్ చేస్తుండాలి. దీనికోసం డెస్క్ క్లీనప్ చేయాల్సి ఉంటుంఇద. విండోస్ బటన్ నొక్కి సెర్చ్ బాక్స్‌లో ‘డిస్క్ క్లీనప్’ అని టైప్ చేస్తే.. ఒక టూల్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అన్ని డ్రైవ్ లను సెలక్ట్ చేసి ‘ఓకే’ నొక్కుతూ వెళ్లాలి. ఇలా చేయడం ద్వారా సీ డ్రైవ్ లో ఉండే టెంపరరీ ఫైల్స్ అన్నీ డిలీట్ అవుతాయి. తర్వాత సిస్టమ్ ని ఓసారి రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా వారానికోసారి చేయొచ్చు.
ఇంటర్నెట్ సెక్యూరిటీ..
వైరస్ లేదా మాల్వేర్స్ వంటివి బ్రౌజర్ ద్వారానే ఎంటర్ అవుతాయి. కాబట్టి క్రోమ్ , ఎడ్జ్ వంటి బ్రౌజర్స్ నే వాడాలి. అలాగే బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ప్రైవసీ అండ్ సెక్యూరిటీ’లో.. ‘సైట్ సెట్టింగ్స్’లోకి వెళ్లి పర్మిషన్స్, నోటిఫికేషన్స్ వంటివి ఏయే సైట్స్‌కు ఇచ్చారో సరిచూసుకోవాలి. మీకు తెలియని వెబ్‌సైట్లు ఏవైనా ఉంటే వెంటనే పర్మిషన్లు డిజేబుల్ చేయాలి. అలాగే వీలుంటే ఇంటర్నెట్ సెక్యూరిటీ వరకూ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తీసుకోవచ్చు.
ఇవి కనెక్ట్ చేయొద్దు
ఇకవీటితో పాటు పీసీని ఎప్పుడూ పబ్లిక్ వైఫై లకు కనెక్ట్ చేయొద్దు. అలాగే వేరేవాళ్ల పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు కనెక్ట్ చేయకుండా చూసుకోవాలి. విండోస్ అప్ డేట్స్ వస్తే.. ఎప్పటికప్పుడు ఇన్ స్టాల్ చేస్తుండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మ్యాగ్జిమమ్ వైరస్ ఎటాక్స్ జరగకుండా పీసీని కాపాడుకోవచ్చు.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..