Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఎక్కడెక్కడంటే..?

Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఎక్కడెక్కడంటే..?


Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఎక్కడెక్కడంటే..?

ఏపీలో అన్న క్యాంటీన్లపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలు, నగరాల్లో మాత్రమే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయగా.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని ప్రారంభించనుంది. మండల కేంద్రాల్లో కొత్తగా అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు వీటిని ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఉగాదికి రూరల్ ఏరియాల్లో 75 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. దీని వల్ల గ్రామీణ ప్రజలకు కూడా రూ.5కే నాణ్యమైన భోజన సదుపాయం అందుబాటులోకి రానుంది. టిఫిన్, లంచ్, డిన్నర్ తక్కువ ధరకే లభించనుంది. ఉగాది నాటికి వీటిని స్టార్ట్ చేయాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన చేశారు.

ఉగాది రోజు ప్రారంభం

ప్రస్తుతం రాష్ట్రంలో 205 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు వీటి ద్వారా 3.07 కోట్ల మంది బ్రేక్ ఫాస్ట్ చేయగా.. 3.64 కోట్ల మంది భోజనం, 1.59 కోట్ల మంది డిన్నర్ చేశారు. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. జనవరిలో సంక్రాంతి సందర్భంగా కొత్త అన్న క్యాంటీన్లను నెలకొల్పాలని ప్రభుత్వం భావించింది. కానీ పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ప్రారంభం కాలేదు. ఇఫ్పుడు అన్నీ పనులు పూర్తి కావడంతో త్వరలోనే 75 క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. వీటి వల్ల మరింత మంది ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందించనుంది. రోజువారీ కూలీలు, పేదలకు దీని వల్ల లబ్ది చేకూరనుంది.

చురుగ్గా పనులు

ఇప్పటికే మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉగాది నాటికి వీటిని పూర్తి చేసి ప్రారంభించనున్నారు. పనులను పూర్తి చేయాలని అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో భావించింది. దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నారు. ఒక్కో క్యాంటీన్‌కు ప్రభుత్వం రూ.65 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని క్లోజ్ చేసింది. తిరిగి 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక వీటిని తిరిగి తెరిచింది. టీడీపీ అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు మేనిఫోస్టోలో కూడా ఈ విషయాన్ని పొందుపర్చారు. దీంతో ఆ హామీ మేరకు అధికారంలోకి రాగానే ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పథకాన్ని తిరిగి పున:ప్రారంభించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *