Andhra Pradesh: రక్తదాన శిభిరంగా మారిన పెళ్లి మండపం.. అసలు ముచ్చట ఇదే!

Andhra Pradesh: రక్తదాన శిభిరంగా మారిన పెళ్లి మండపం.. అసలు ముచ్చట ఇదే!


కర్నూలు, ఫిబ్రవరి 27: ఆదోని పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ విరుపాక్షి కి గురువారం వివాహం జరిగింది. అయితే తన వివాహం సందర్భగా రక్త దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆదోని పట్టణం బోయగిరి చెందిన విరుపాక్షి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ముందుంటారు. జన సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా రక్తదానంపై అవగాహన ప్రజల్లో చైతన్యం చేస్తూ ఆపదలో ఉన్నవారికి ఏ సమయంలోనైనా బాధితులకు ఏ రక్త గ్రూపు అయినా రక్తదానం చేస్తారు.. చేయిస్తారు.

దీంతో ఆదోని నియోజకవర్గంలో రక్తదాత విరుపాక్షి పేరు తెలియని వారుండరంటే అతియోక్తి కాదు. అర్ధరాత్రి ఆసుపత్రిలో రక్తం కోసం ఎవరు ఫోన్ కాల్ చేసిన దాతల చేత రక్తదానం చేయించేవారు. జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి రక్తాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తన వివాహం సందర్భంగా రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పెళ్లి కార్యక్రమానికి వచ్చిన అతిథులు విరుపాక్షిని ఆదర్శంగా తీసుకొని 27 మంది రక్తదానం చేశారు. అంతేకాకుండా అతని వివాహంలో రక్త దానం శిబిరం కూడా ఏర్పాటు చేశాడు. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటంతో పాటు ఇతరులకు కొంత మంచి పని చేయాలనేది విరుపాక్షి ఉద్దేశం. కాబట్టి విరుపాక్షి చేసింది మంచి పనే కదా.. ఇలా ప్రతి ఒక్కరు తన పని చేసుకుంటూనే మరొకరికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేస్తే సమాజంలో కక్షలు, ఘర్షణలు తగ్గిపోయి.. శాంతియుత వాతావరణం నెలకొంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *