Andhra Pradesh: బాహుబలి బీట్‌రూట్.. ఒక్కోటి ఎన్ని కిలోలు ఉన్నాయో తెలిస్తే అవాక్కే.. వీడియో వైరల్..

Andhra Pradesh: బాహుబలి బీట్‌రూట్.. ఒక్కోటి ఎన్ని కిలోలు ఉన్నాయో తెలిస్తే అవాక్కే.. వీడియో వైరల్..


Andhra Pradesh: బాహుబలి బీట్‌రూట్.. ఒక్కోటి ఎన్ని కిలోలు ఉన్నాయో తెలిస్తే అవాక్కే.. వీడియో వైరల్..

సాధారణంగా మార్కెట్‌లో మనం చూసే బీట్‌రూట్ దుంపలు అర కిలో లోపే ఉంటాయి. కానీ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం రెండున్నర కిలోల బరువున్న భారీ బీట్‌రూట్‌లు సందడి చేస్తున్నాయి. చిన్నపాటి కొబ్బరి బొండాల పరిమాణంలో ఉన్న ఈ బాహుబలి దుంపలను చూసేందుకు స్థానికులు, వ్యాపారులు క్యూ కడుతున్నారు. మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి వుర్రింక రాఘవ వద్ద ఈ భారీ బీట్‌రూట్‌లు ప్రత్యక్షమయ్యాయి. వీటి గురించి ఆయన వివరిస్తూ.. ఇవి కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుంచి దిగుమతి అయిన లోడ్‌లో వచ్చాయని తెలిపారు. సాధారణంగా వచ్చే దుంపల కంటే ఇవి ఐదు రెట్లు ఎక్కువ బరువు ఉండటంతో ఆయన కూడా ఆశ్చర్యపోయారు.

నిపుణులు ఏమంటున్నారు?

ఈ అసాధారణ పెరుగుదలపై రాజోలు ఉద్యానవన శాఖ అధికారి దిలీప్ కుమార్ కీలక విషయాలు చెప్పారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించినప్పుడు, నేలలోని పోషకాలు సమృద్ధిగా అందినప్పుడు ఇలాంటి దుంపలు అసాధారణ రీతిలో బరువు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ భారీ బీట్‌రూట్‌ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోనసీమ వాసులు వీటిని ఆశ్చర్యంగా చూస్తూ..”ఇవి బీట్‌రూట్‌లా లేక కొబ్బరి బొండాలా?” అంటూ కామెంట్ చూస్తున్నారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *