Andhra Pradesh: బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. ధైర్యముంటేనే వీడియో చూడండి..

Andhra Pradesh: బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. ధైర్యముంటేనే వీడియో చూడండి..


Andhra Pradesh: బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. ధైర్యముంటేనే వీడియో చూడండి..

అడవులు, పొదల్లో ఉండాల్సిన జంతువులు, విషసర్పాలు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసమో.. మరే ఇతర కారణమో ఏమోగానీ.. జనావాసాల మధ్య సంచరిస్తూ భయపెడుతున్నాయి. ఇటీవల కాలంలో విశాఖలో విశ్వసర్పాల బెడద జనాలను పట్టిపీడిస్తోంది. తాజాగా షీలానగర్‌లో ఓ ఇంట్లో కుటుంబానికి త్రుటిలో పెద్ద ముప్పు తప్పింది. ఏ సమయంలో ఇంట్లోకి చొరబడిందో ఏమోగానీ.. వాష్ రూ‌మ్‌లో నాగుపాము భుసలు కొట్టింది. మహిళ వాష్ రూమ్ కి వెళ్లి కమోడ్ వైపు చూసేసరికి.. అక్కడ ఏదో కదులుతూ ఉన్నట్టు అనిపించింది. కాస్త తదేకంగా చూసి.. లోపల ఉన్నది పాము అని తెలుసుకొని కేకలు పెట్టింది ఆ మహిళ. వెంటనే ఆ పాము కమోడ్ నుంచి పైకి లేచి పడగ విప్పింది. వణికిపోయిన ఆ మహిళ బయటకు పరిగెత్తకొచ్చింది. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. అసలు విషయాలను తెలుసుకున్న ఆ కుటుంబం గుండెలు పట్టుకున్నారు. వెంటనే స్నేక్ కేచర్ నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. కమోడ్ లో దాగి ఉన్న నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు.

వాస్తవానికి ఇంట్లో బెడ్ రూమ్‌కు అటాచ్ అయి ఉన్న వాష్ రూమ్‌లో ఈ ఘటన అందరిలో వణుకు పుట్టించింది. విన్నవారందరికీ కలవరపాటుకు గురిచేసింది. ఎందుకంటే సాధారణంగా అవుట్ సైడ్ ఉన్న వాష్ రూములలో అడపాదడపా ఇటువంటి ఘటనలు జరుగుతుండడం మనకు తెలుసు. కానీ ఇంటి లోపల ఉన్న వాష్ రూమ్‌లో అది కూడా కమోడ్‌లో నక్కి ఉన్న నాగుపాము.. అందరినీ టెన్షన్ పెట్టించింది. లోపలకు వెళ్లిన ఆ మహిళ కాస్త ఏమరపాటుకు గురైనా ఆ మహిళ నాగుపాము కాటుకు గురయ్యేది. అదృష్టవశాత్తు ముందే ఆ పామును గుర్తించడంతో పెద్ద ముప్పే తప్పింది. నాగుపామును సేఫ్‌గా రెస్క్యూ చేసి తరలించినప్పటికీ.. ఇప్పటికీ ఆ కుటుంబం బెడ్ రూమ్‌లో ఉన్న ఆ వాష్ రూమ్‌కి వెళ్లేందుకు సాహసం చేయడం లేదు. వాష్ రూమ్‌కు కనెక్ట్ అయిన సెప్టిక్ ట్యాంక్ గొట్టం ద్వారా ఎలుకలను వేటాడుతూ బయట నుంచి ఆ పాము వాష్ రూమ్ లోకి వచ్చి ఉంటుందని స్నేక్ కేచర్ నాగరాజు చెప్పాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *