Andhra Pradesh: ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు, విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

Andhra Pradesh: ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు, విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?


విశాఖలోని హెచ్ బీ కాలనీ.. కృష్ణ కాలేజ్ రోడ్డు.. అక్కడే జ్యోతి వైన్స్. విద్యార్థులు నిత్యం ఆ ప్రాంతం నుంచే స్కూల్లో కాలేజీలకు వస్తూ వెళ్తూ ఉంటారు. సమీపంలో విద్యాలయాలు కూడా ఉన్నాయి. జ్యోతి వైన్స్ వద్ద.. నిత్యం మందుబాబుల బెడద స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు మందుబాబుల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. చీకటి పడితే చాలు ఆ సమస్య మర్రి తీవ్ర రూపం దాలుస్తోంది. వైన్ షాప్‌లో మద్యం చూసుకొని నేరుగా.. సమీపంలోనే అపార్ట్‌మెంట్స్ సెల్లార్లు, పరిసర ఇళ్ల గోడలు, గట్లపై కూర్చొని మద్యం సేవిస్తూ ఉన్నారు. అటుగా వెళుతున్న మహిళలు, విద్యార్థినిలు ఆ మందుబాబుల ఆగడాలకు భయాందోళనకు గురవుతున్నారు.

సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కారం కాకపోవడంతో ఇక తామే ఆ సమస్యను తీర్చుకోవాలని సిద్ధమయ్యారు. తాగుబోతుల వేధింపుల నుంచి కాపాడాలంటూ రోడ్డెక్కారు స్థానికులు. జనావాసాల మధ్య మద్యం షాపును తొలగించాలంటూ హెచ్.బి కాలనీలో ఆందోళన చేపట్టారు. పోస్టర్లు ఫ్లెక్సీలు చేత పట్టుకుని గళం విప్పారు. జ్యోతి వైన్స్ ఎదుట ధర్నా చేశారు. మందుబాబుల బెడదతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని పర్యవేక్షించారు. బహిరంగంగా మద్యం అమ్మకాలు, ఓపెన్ డ్రింకింగ్‌తో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. చోరీలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువయ్యాయని స్థానికులు వాపోయారు. వైన్ షాప్ వల్ల మందుబాబుల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ చేతులెత్తి వేడుకున్నారు స్థానికులు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *