పిచ్చుకలు అంతరించ పోకుండా ఉండాలి అని రిటైర్డ్ ఉపాధ్యాయుడు విన్నుతంగా శ్రమిస్తున్నాడు. రైతుల దగ్గర నుండి వరి పంట సేకరించి వాటిని అందంగా కుంచెలుగా తయారుచేసి ప్రతి గ్రామంలో వుండే దేవాలయాలు, పాఠశాలలులో కడుతు అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ విదంగా ఏర్పాటు చేయడం వల్ల పిచ్చుకులుకు ఆహారం దొరుకుతుంది. తద్వారా పిచ్చుకలు జాతి అభివృద్ధి చెందుతాయి అని మాస్టర్ చెబుతున్నారు.
కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు దాలినాయడు 2019 లో పదవి విరమణ చేసారు. అయన పదవి విరమణ దగ్గర నుండి పిచ్చుకలు అంతరించ పోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదట వరి పంటతో ఈ కుంచెలు కట్టడం ఒక రైతు దగ్గర నేర్చుకొని.. తరవాత తనే స్వయంగా కుంచెలు కట్టడం మొదలుపెట్టారు. వీటిని తుని పరిసర ప్రాంతాలు దేవాలయాలు, పాఠశాలలు కట్టడం మొదలుపెట్టారు. తరువాత తన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కు ఈ విద్య నేర్పించారు. హరిత వికాస్ ఫౌండేషన్ ఏర్పాటు గ్రామాలులో వుండే మహిళలుకు పక్షులకు కుంచలు కట్టడం నేర్పించారు. తరువాత రాష్ట్ర మొత్తం తిరుగుతూ అందరికి ఈ కుంచెలు కట్టడం నేర్పిస్తున్నారు.
పిచ్చుకలు అంతరించిపోకూడనే ఉద్దేశం మొదట రైతులు దగ్గర నుండి వరి పంట సేకరించి ఈ కుంచెలు కట్టేవాడినని ఆయన తెలిపారు. తరువాత నాకున్న భూమిలో వరి సాగు చేస్తు ఈ కార్యక్రమం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అన్నదాతలతో కలిసి ఏర్పాటు చేస్తే రైతులకు మంచి అవకాశాలు ఏర్పడుతాయి. అని ఆయన అంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.