Andhra News: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!

Andhra News: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!


Andhra News: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!

హైదరాబాద్‌ తరహాలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతో పాటు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజమండ్రికి ఔటర్ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రాణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై అధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రుడా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ కొన్నిసూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని.. కొన్ని గ్రామాలను ఈ జాబితా నుంచి తప్పించి రింగ్‌ రోడ్డు విస్తీర్ణం తప్పించాలని సూచించారట.

అయితే మొదటి ప్లాన్ ప్రకారం ఈ ఔటర్ రింగ్ రోడ్డు రాజమండ్రిలోని మధురపూడి, ఎయిర్‌ పోర్టు రోడ్డును కలుపుతూ.. ‘రాజానగరం, దివాన్‌చెరువు, శ్రీరాంపురం, సంపత్‌నగర్, పుణ్యక్షేత్రం, నామవరం మీదుగా కడియం’ వరకు వెళ్లాల్సి ఉంది. ఈ మెత్తం దూరంగా 35 కిలోమీటర్లు కానుంది. కానీ తాజా నిర్ణయం, ప్రతిపాదన ప్రకారం ఈ మొత్తం 24 కిలోమీటర్లకు తగ్గనుందట. ఈ రోడ్డు నిర్మాణానికి గతంలో 1500 ఎకరాల భూమి అవసరం అవుతుండగా..ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం కేవలం 6 నుంచి 8 వందల ఎకరాలు భూమిని సేకరిస్తే పరిపోతుంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా ఆమోదం లభించలేదు.

అయితే ప్రతస్తుం చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16 రాజానగరం, దివాన్‌చెరువు, లాలాచెరువు మీదుగా వెళుతోంది. అంతేకాదు రాజమండ్రిని ఆనుకొని గుండుగొలును హైవే కూడా ఉంది. ఈ కారణంగా నగరంలో ట్రాఫిక్ సమ్యలు పెరిగిపోతున్నాయి. ఒక వేళ రాజమండ్రి నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఈ ట్రాఫిక్ సమస్యలు అన్ని తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *