Andhra: హైదరాబాద్ నుంచి విజయవాడ పెళ్లికి.. కట్ చేస్తే.. అమ్మవారి దర్శనం ముగించుకుని వచ్చేసరికి..

Andhra: హైదరాబాద్ నుంచి విజయవాడ పెళ్లికి.. కట్ చేస్తే.. అమ్మవారి దర్శనం ముగించుకుని వచ్చేసరికి..


Andhra: హైదరాబాద్ నుంచి విజయవాడ పెళ్లికి.. కట్ చేస్తే.. అమ్మవారి దర్శనం ముగించుకుని వచ్చేసరికి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో మహా కుంభాభిషేకం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలి దగ్గర 50 లక్షల బంగారం మిస్ అయింది. కుంభాభిషేకం కావడంతో అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన భక్తురాలి దగ్గర 50 లక్షల విలువైన బంగారం చోరికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ పెళ్లికి వచ్చిన మహిళా భక్తురాలు.. అమ్మవారి దర్శనం చేసుకొని రావిచెట్టు దగ్గరకి వచ్చే సరికి బంగారం దోచుకెళ్లారు దొంగలు.

రావి చెట్టు దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, అక్కడే తన బ్యాగ్‌లో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారంటోంది బాధితురాలు. ఆమె ఫిర్యాదుతో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు విజయవాడ వన్ టౌన్ పోలీసులు. నిన్నటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు దుర్గమ్మ ఆలయంలో మహా కుంభభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా దుర్గమ్మ ఆలయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా.. ఎక్కడికక్కడ టెంట్స్ ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ఈ టెంట్లే ఇప్పుడు సమస్యగా మారాయి. సీసీ కెమరాలకు టెంట్లు అడ్డురావటంతో.. దొంగలను గుర్తించడం కష్టంగా మారిందంటున్నారు పోలీసులు. బాధితురాలి ఫిర్యాదుతో ఆలయంలో దొంగల కోసం ప్రత్యేక బృందాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. పాత పిక్ పాకెటర్స్‌ను కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. దొంగలను పట్టుకుని బాధితురాలికి న్యాయం చేస్తామంటున్నారు పోలీసులు.

ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *