గుంటూరు జిల్లాను డయేరియా, కలరా కేసులు భయపెడుతున్నాయి.. మూడు కలరా కేసులు బయటపడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అంతేకాకుండా.. గుంటూరులో అధికారులు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించడంతోపాటు కేసులు బయటపడిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ముందుగా.. గుంటూరు జిల్లా తెనాలిలోని అంగలకుదురులో ఓ మహిళకు కలరా నిర్ధారణ అయింది. తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్‌లో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆ మహిళ వచ్చిందంటున్నారు అధికారులు.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు.. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తెనాలి నియోజకవర్గవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని గ్రామాల్లో డయేరియాపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంగలకుదురులో అన్ని శాఖలను అప్రమత్తం చేశామంటున్నారు అధికారులు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, RMPల దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. మణిపాల్ ఆస్పత్రిలో కలరా బాధితురాలు కోలుకున్నారని చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. గుంటూరులో 92 డయేరియా యాక్టీవ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఓల్డ్ గుంటూరులోని 9 హై రిస్క్ ప్రాంతాల గుర్తించి.. 50 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారి ఇన్‌ఛార్జ్‌గా టీమ్స్ ఏర్పాటు చేశారు. ట్రేస్ అండ్ ట్రీట్ పద్దతిలో సర్వే చేయిస్తున్నామని.. గుంటూరులో పానిపూరి బండ్లు పూర్తిగా క్లోజ్ చేసినట్లు కలెక్టర్ తమీమ్ తెలిపారు.
ప్రగతినగర్, రాంరెడ్డి తోట ప్రాంతంలో ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను.. పర్యవేక్షించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా.. వైద్యశిబిరంలో రోగులు, డాక్టర్లతో మాట్టాడాకగ. కాచి చల్లార్చిన నీటిని తాగాలని కలెక్టర్ సూచించారు. అంతేకాకుండా.. గుంటూరులో కలెక్టర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించి తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..