
అడవులు, పొదల్లో ఉండాల్సిన సర్పాలు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లలోకి కూడా స్థిరపడుతున్నాయి సర్పాలు. వాష్ రూమ్‌లోనూ, ఏసీన్లోనూ, ఫ్రిజ్లలోనూ.. ఒకటి కాదు.. ఇటీవల పాములు కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ కలవరపాటుకు కురిచేస్తున్నాయి. తాజాగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగి రాంప్రసాద్ ఇంటి దగ్గర ఓ పాము భయపెట్టింది. రాంప్రసాద్ ఇంటి పరిషత్‌లో ఖాళీ ప్రాంతం ఉండడంతో ఆ కుటుంబానికి కుక్కలు, పందుల బెడద ఎక్కువైంది. దీంతో జంతువులు ఇంటి ఆవరణలోకి రాకుండా ఓ వలను కంచెగా ఏర్పాటు చేశారు. కొంతకాలంగా వారికి జంతువుల బెడద లేదు. తాజాగా ఆ వల దగ్గర షాకింగ్ సీన్ కనిపించింది. కంచె కోసం పెట్టిన వలలో భారీ పాము చిక్కుకుంది. బయటపడేందుకు బుసలు కొడుతూ ఉంది.
ఏవో శబ్దాలు వస్తుందంటే గుర్తించి అటువైపు వెళ్లి చూసేసరికి పాము కనిపించింది. దీంతో ఆందోళనతో గుండె పట్టుకున్నారు. కిరణ్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కిరణ్ కుమార్.. వలలో చిక్కుకున్న పామును బయటకు తీసే ప్రయత్నం చేశారు. వల వైర్లలో చిక్కుకుని పాము శరీరమంతా గాయపడే స్థితికి జరిగింది. దీంతో ఓపిగ్గా అక్కడ కూర్చొని వలను కత్తిరించాడు. అరగంట పాటు శ్రమించి వలలో చిక్కుకున్న పామును ఎట్టకేలకు పైకి తీశాడు. వలలో చిక్కుకున్న పామును సేఫ్‌గా రెస్క్యూ చేసిన కిరణ్ కుమార్.. ఆ పాము నాగ జెర్రిగా గుర్తించారు. దాదాపుగా ఐదున్నర అడుగులు ఉంది. నాగజెర్రిని సేఫ్‌గా రెస్క్యూ చేయడంతో రాంప్రసాద్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి విషరహిత సర్పాల్లో నాగ జెర్రి ఒకటి. కీటకాలు, ఎలుకలు, బల్లులు వీటికి ఆహారం. పొలాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఈ పాములు. ఈ సర్పాలకు రైతు నేస్తం అని పేరు. ఎందుకంటే పొలాలకు నష్టాన్ని చేకూర్చే ఎలుకలను ఆహారంగా తీసుకుంటూ.. ఆ బెడద నుంచి రైతులకు మేలు చేస్తుంది నాగ జెర్రి.
ఇది చదవండి: మెట్రో ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకున్నా చెల్లింపులు..!