అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారీ నాగుపాము హల్చల్ చేసింది. స్థానిక కొమానపల్లి గ్రామంలోని ఒక ఇంటి డొక్కల గూడులో ఆరు అడుగుల భారీ నాగుపాము దూరింది. కావూరి చంటమ్మ అనే వ్యక్తి ఇంటి వద్ద భారీ నాగుపామును చూసి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. అతడు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని నాగుపామును చాకచక్యంగా బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో ఆ ఇంటి యజమాని, స్థానికులు హమ్మయ్య.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పాముల సంచారం పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, పాములు కనిపిస్తే తనకు సమాచారం అందించాలని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ కోరాడు.