పండగ సీజన్లో బాగా సొమ్ము చేసుకోవచ్చు అనుకున్నారో ఏమో.. తెలీదు కానీ.. గంజాయి రవాణాకు పూనుకున్నారు కొందరు వ్యక్తులు. అయితే వారి ప్రయాణం కొంతదూరం వరకు సాఫీగానే సాగింది. దారిలో విశాఖ జిల్లా భీమునిపట్నం వద్ద టోల్ సిబ్బందిని వారు నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఆగకుండా వెళ్లిపోయారు. ఈ క్రమంలో.. కృష్ణంపాలెం వద్ద పోలీసులు కనిపించడంతో.. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారి కారును ఛేజ్ చేశారు పోలీసులు. చివరకు వెంటాడి పట్టుకున్నారు. చెక్ చేయగా కారులో మొత్తం 350 ప్యాకెట్లలో నింపిన 384 కిలోల గంజాయి పట్టుబడింది. దాని విలువ రూ.29 లక్షల ఉంటుందని చెప్పారు పోలీసులు. గంజాయితో పాటు కారు, 2 సెల్ఫోన్లు సీజ్ చేశారు. నిందితులు విశాఖపట్నం నుంచి రాజమండ్రికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు కాకినాడ ఎస్పీ బింధుమాధవ్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.