గోడ రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.ఓ వ్యక్తి పాత ఇంటిని కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. దాని గోడ కూలి రోడ్డుపై వెళ్తున్న వాహనదారుడిపై పడింది.. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.. ఈ ఘటన.. అనంతపురం జిల్లా గుంతకల్లులో శనివారం జరిగింది..
మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కూరగాయల మార్కెట్ వెనుక రమేశ్ అనే వ్యక్తి ఓ పాత ఇంటిని కొనుగోలు చేసి.. మరమ్మతులు చేయిస్తున్నాడు.. రెండు రోజుల దగ్గర ఆ ఇంటిలో పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే.. ఏకలవ్యనగర్లో కిరాణా దుకాణం నడిపే వెంకటరాముడు (57) షాపులో సరుకులు నిమిత్తం శనివారం బైక్పై మార్కెట్కు బయలు దేరాడు.. మార్కెట్ కు వెళ్లి.. సామాన్లు తీసుకుని.. అదే మార్గంలో తిరుగు ప్రయాణమయ్యాడు.. వెంకటురాముడు వస్తుండగా పనులు జరుగుతున్న ఇంటి వద్దకు రాగానే.. ఒక్కసారిగా ఇంటి గోడ కుప్పకూలి అతనిపై పడింది.
బైక్ పై వెళ్తున్న వెంకటరాముడిపై.. గోడ పడిపోవడంతో అతను తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మృతిచెందాడు.. అయితే.. భర్త సరుకుల కోసం వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో భార్య ఉమాదేవి అక్కడికి చేరుకుంది.. మట్టిపెళ్లల కింద విగతజీవిలా పడి ఉన్న భర్త వెంకటరాముడిని చూసి ఉమాదేవి గుండెలవిసేలా రోదించింది..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. మారికాసేపట్లో వాస్తడనుకున్న వెంకటరాముడు.. గోడ కింద పడి మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..