Andhra: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని తెగేసి చెప్పేశాడు

Andhra: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని తెగేసి చెప్పేశాడు


Andhra: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని తెగేసి చెప్పేశాడు

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని చాలాసార్లు చాలామంది దారి తప్పిన సంఘటనలు ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ దారి తప్పుగా చూపించడంతో కొన్నిసార్లు కార్లు చెరువులోకి వెళ్లాయి. కొన్నిసార్లు అడవిలోకి.. అసలు దారేలేని పంట పొలాల మధ్యలోకి కూడా గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్లిన సంఘటన చూశాం. సరిగ్గా అలాగే ఓ ఐచర్ వాహనం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని పుట్టపర్తి పట్టణంలో సందు గొందుల్లోకి వెళ్లి ఇరుక్కున్నాడు. పుట్టపర్తి పట్టణంలోకి కాకుండా బైపాస్‌లో నుంచి వెళ్లాల్సిన ఐచర్ వాహనం.. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని పట్టణం నడిబొడ్డులో ఉన్న కమ్మ వీధిలోని సందుల్లోకి వెళ్లి చిక్కుకున్నాడు.

దారి తప్పిన విషయం తెలుసుకున్న ఐచర్ వాహనం డ్రైవర్.. చిన్న చిన్న సందులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ స్తంభాన్ని ఐచర్ వాహనం ఢీ కొట్టింది. దీంతో ఐచర్ వాహనంపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. వాహనంపై విద్యుత్ స్తంభం పడడంతో షార్ట్ సర్క్యూట్ కొడుతుందని వాహనం దిగి డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఐచర్ వాహనం ఢీకొట్టడంతో విద్యుత్ వైర్లన్నీ తెగి వాహనంపై పడిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. జనసంచారం ఉన్న వీధిలోకి ఐచర్ వాహనం ఎలా తీసుకొచ్చారని స్థానికులు డ్రైవర్‌ను ప్రశ్నించారు. గూగుల్ మ్యాప్స్ తప్పుడు మార్గం చూపించిందని.. గూగుల్ మ్యాప్స్ సరైన దారి చూపిస్తుందన్న ఉద్దేశంతో పట్టణంలోకి వచ్చి ఇలా ఇరుక్కుపోయానని అంటున్నాడు ఐచర్ వాహనం డ్రైవర్. అందుకే గూగుల్ మ్యాప్స్‌ను నమ్మొద్దంటున్నాడు.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *