Allu Sirish Wedding: అల్లు శిరీష్ పెళ్లిలో పవన్ కల్యాణ్ చిన్న కూతురు.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో

Allu Sirish Wedding: అల్లు శిరీష్ పెళ్లిలో పవన్ కల్యాణ్ చిన్న కూతురు.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో


Allu Sirish Wedding: అల్లు శిరీష్ పెళ్లిలో పవన్ కల్యాణ్ చిన్న కూతురు.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో

అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్- నయనికల వివాహం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మార్చి 7) రాత్రి హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరైంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా, రామ్ చరణ్ ,ఉపాసన, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కొణిదెల సుస్మిత.. మెగా ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ అందరూ అల్లు శిరీష్ పెళ్లికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా ఇదే పెళ్లి వేడుకలో పవన్ కల్యాణ్ చిన్న కూతురు పొలేనా అంజనా కొణిదెల తళుక్కుమంది. అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా సంప్రదాయ దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు పవన్. అప్పుడు అంజనా కనిపించింది. ఆ తర్వాత మళ్లీ పబ్లిక్‌లో అంజనా కనిపించడం ఇదే మొదటిసారి.

అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో పవన్ కల్యాణ్ వెంటే నడిచింది అంజనా కొణిదెల.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని చూసిన మరుక్షణమే ‘హాయ్ పెదనాన్న’ అంటూ పొలేనా అంజనా కొణిదెల పలకరించింది. ఇక మెగాస్టార్ కూడా పవన్ కుమార్తెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడారు. మొత్తానికి అల్లు శిరీష్ – నయనికా రెడ్డి పెళ్లి వేడుకలో పవన్ కల్యాణ్ చిన్న కూతురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం పొలేనా అంజనా కొణిదెల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ చిన్న కూతురు ట్రెడిషినల్ దుస్తుల్లో చాలా అందంగా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

పవన్ కల్యాణ్ వెంటపొలేనా అంజనా కొణిదెల.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *