Allu Sirish: నైనిక అంటే ఎంత ప్రేమో! భార్య పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నఅల్లు శిరీష్.. ఫొటోస్ ఇదిగో

Allu Sirish: నైనిక అంటే ఎంత ప్రేమో!  భార్య పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నఅల్లు శిరీష్.. ఫొటోస్ ఇదిగో


Allu Sirish: నైనిక అంటే ఎంత ప్రేమో!  భార్య పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నఅల్లు శిరీష్.. ఫొటోస్ ఇదిగో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొదరుడు, హీరో అల్లు శిరీష్ ఇటీవల తన ప్రేయసి నైనిక రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. మార్చి 06న వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అల్లు శిరీష్- నైనికల పెళ్లి వేడుకలు పూర్తయినా ఇప్పటికీ వీరి వెడ్డింగ్ ఫొటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అల్లు శిరీష్ తన పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని విషయాలు, ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తన మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన శిరీష్.. ఇవి తన జీవితంలో మర్చిపోలేని క్షణాలని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నైనిక తన చేతులకు గోరింటాకు పెట్టుకుని ఉండగా శిరీష్ ఆమె భుజంపై చేయి వేసి ఉన్న ఫొటో అయితే హైలెట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫొటోలో అల్లు శిరీష్ తన చేతి పై నయనిక పేరును తెలుగులో మెహందితో డిజైన్ చేయించుకున్నాడు. ఈ ఫోటోని షేర్ చేసిన శిరీష్ నా పెళ్లి వేడుకలో మోస్ట్ ఫేవరెట్ మూమెంట్ అంటూ అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అల్లు శిరీష్ టాటూకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ విషెస్ చెబుతున్నారు. ఇక అల్లు శిరీష్- నైనికల ప్రేమ విషయానికి వస్తే.. వీరు సుమారు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారట. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి బ్యాచిలర్ పార్టీలో మొదటిసారి నైనిక తనకు పరిచయమైందని శిరీష్ చెప్పుకొచ్చాడు. అలా మొదలైన వారి పరిచయం స్నేహంగా మారిందని, ఆ తర్వాత ప్రేమగా చిగురించిందని అల్లు వారబ్బాయి తెలిపాడు.

అల్లు శిరీష్- నయనికల బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో..

 

View this post on Instagram

 

A post shared by Allu Sirish (@allusirish)

ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా 2024లో బడ్డీ అనే సినిమాలో కనిపించాడీ అల్లు వారబ్బాయి. ఆ తర్వాత కొన్ని టీవీ షోస్ లో మాత్రమే సందడి చేశాడు. త్వరలోనే తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Allu Sirish (@allusirish)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *