Allu Sirish: అట్టహాసంగా అల్లు శిరీష్, నయనికల వివాహం.. ఆశీర్వదించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. వీడియో

Allu Sirish: అట్టహాసంగా అల్లు శిరీష్, నయనికల వివాహం.. ఆశీర్వదించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. వీడియో


Allu Sirish: అట్టహాసంగా అల్లు శిరీష్, నయనికల వివాహం.. ఆశీర్వదించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. వీడియో

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్‌ఓ ఇంటివాడయ్యారు. నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. హైదరాబాద్ వేదికగా శుక్రవారం (మార్చి 06) రాత్రి శిరీష్- నయనికల వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలతో పాటు బంధువుల, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు అల్లు శిరీష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం రోజే (మార్చి 6) అల్లు శిరీస్ పెళ్లి వేడుక జరగడం విశేషం.

కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్ లో అల్లు శిరీష్ – నయనిక పెళ్లి జరిగింది. ఈ వివాహానికి చిరంజీవి, సురేఖ దంపతులతో సహా మెగా ఫ్యామిలీ సభ్యులందరూ హాజరయ్యారు. రామ్ చరణ్- ఉపాసనలు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ఈ వేడుకకు హాజరై శిరీష్- నయనిక దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో

కాగా అల్లు శిరీష్‌- నయనిక కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్‌ భార్య షాలినికి నయనిక బెస్ట్‌ ఫ్రెండ్‌. వరుణ్‌తేజ్‌- లావణ్య తమ పెళ్లి సందర్భంగా ఇచ్చిన పార్టీలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటలెక్కారు.

పెళ్లి వేడుకలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *