Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం

Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం


Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం

కరీంనగర్, తెలంగాణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి09న కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణలో తమ అభిమాన సంఘాన్ని మరింత బలోపేతం అలాగే విస్తరించే దిశగానూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని 5 జిల్లాలకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లా కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కమిటీల ఏర్పాటు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల కార్యక్రమాలను సమన్వయం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన “One Good Deed Every Year” అనే సందేశాన్ని అనుసరిస్తూ, ప్రతి సంవత్సరం కనీసం ఒక మంచి పని చేసి సమాజానికి సేవ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. సమావేశానికి సంబంధిత జిల్లాల ప్రతినిధులు, అభిమానులు హాజరై రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకత్వంలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించినట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఇటీవలే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇచ్చిన “One Good Deed Every Year” అనే సందేశాన్నిబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్

The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..

Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *