Akkineni Nagarjuna: నా ఫొటో, పేరును వాడుకోవద్దు.. హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున..

Akkineni Nagarjuna: నా ఫొటో, పేరును వాడుకోవద్దు.. హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున..


సినీ నటుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటో, పేరును వాడుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్‌ వేశారు. నాగార్జున పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారించారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌లో.. అలాగే వస్తువులు, దుస్తులపై తన చిత్రాన్ని అనధికారికంగా ఉపయోగించడం ద్వారా.. తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘిస్తున్నారని నాగర్జున తరపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అక్కినేని నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడతామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇటీవల ఐశ్వర్యారాయ్‌ విషయంలోనూ హైకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అక్కినేని నాగర్జునకు కూడా ఊరట లభించనుందని పేర్కొంటున్నారు లాయర్లు..

ఇవి కూడా చదవండి..

Andhra: అమ్మబాబోయ్.. కొంచెం అయితే గిరినాగు కాటేసేది.. వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనాల్సిందే..

Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *