Air Strikes: తాలిబాన్‌లే టార్గెట్‌గా పాక్‌ ఆర్మీ ఎయిర్‌ స్ట్రైక్.. 30 మంది మృతి!

Air Strikes: తాలిబాన్‌లే టార్గెట్‌గా పాక్‌ ఆర్మీ ఎయిర్‌ స్ట్రైక్.. 30 మంది మృతి!


తమ దేశంలోని ఉగ్రవాదుల టార్గెట్‌ పాకిస్థాన్‌ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్‌లు చేపట్టింది. ఇందులో భాగంగా అఫ్ఘాన్ సరిహద్దులోని కైబర్ పక్తూంఖ్వా ప్రాంతంలో ఉన్న తిరాహ్ వ్యాలీలో రాత్రి 2 గంటల సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) JF-17 ఫైటర్ జెట్‌లతో 8 LS-6 బాంబులు ఉద్గారించింది. ఇది పాకిస్తాన్ తాలిబాన్ (TTP) ఉగ్రవాదులపై లక్ష్యంగా చేసిన దాడిగా తెలుస్తోంది.

ఉగ్రవాదుల టార్గెట్‌ పాక్‌ ఆర్మీ చేసి ఈ దాడుల్లో సుమారు 20-30 మంది సివిలియన్లు మరణించినట్టు సమాచారం. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ దాడులతో ఘటనా స్థలంలో ఐదు నుంచి 10 ఇళ్ల వరకు ధ్వంసం అయ్యాయని, 20 మందికిపైగా గాయపడ్డట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *