కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. సోషల్ మీడియాలో పోస్ట్ లు రాసేవాళ్లు కొందరు, పోస్టర్స్ పెట్టేవాళ్లు కొందరు, రీల్స్ చేసే వాళ్లు కొందరు.. ఇలా కంటెంట్ లో చాలా రకాలుంటాయి. అయితే కంటెంట్ ఏదైనా దానికోసం కొన్ని ఏఐ టూల్స్ రెడీగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం
వీడ్. ఐఓ(veed.io)
ఈ టూల్ ద్వారా ఈజీగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వీడియో ఎలా ఉండాలో స్క్రిప్ట్ రూపంలో రాసి అప్ లోడ్ చేస్తే.. ఆటోమెటిక్ గా వీడియో రెడీ అవుతుంది. మీ ఫొటో లేకుండా అవతార్స్ తో వీడియో జనరేట్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ వీడియోస్, బిజినెస్ ప్రజెంటేషన్స్ వంటివి కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
ఫైర్‌ఫ్లై
మీ కంటెంట్‌కు తగిన ఇమేజ్‌లు క్రియేట్ చేయడం కోసం ‘అడోబీ ఫైర్‌ఫ్లై’ అనే ఏఐ టూల్‌ను ఉపయోగించొచ్చు. ఈ టూల్ సాయంతో రకరకాల ఇమేజ్‌లు, కాన్సెప్ట్ పోస్టర్లు, వెక్టార్ గ్రాఫిక్స్ వంటివి క్రియేట్ చేయొచ్చు. అయితే ఇందులో పెయిడ్ వెర్షన్ కూడా ఉంటుంది. దీంతో మరిన్ని కొత్త డిజైన్లు పొందొచ్చు.
చాట్ జీపీటీ
ఇది అందరికీ తెలిసిందే. అయితే దీన్ని కంటెంట్ కోసం ఎలా వాడుకోవచ్చో చాలామందికి తెలియదు. చాట్ జీపీటీ ఎలాంటి టెక్స్ట్ కంటెంట్‌ను అయినా సులభంగా క్రియేట్ చేయగలదు. అయితే ఏఐ కంటెంట్‌ను నేరుగా వాడడం వల్ల అంతగా ఉపయోగం ఉండదు. కాబట్టి కొత్త ఐడియాల కోసం లేదా రీసెర్చ్ చేయడం కోసం ఈ టూల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు షార్ట్ ఫిల్మ్ స్టోరీలు, యూట్యుబ్ వీడియోల టాపిక్స్, థంబ్ నెయిల్స్ కోసం టైటిల్స్.. ఇలా టెక్స్ట్ కు సంబంధించి ఎలాంటి కంటెంట్ కైనా చాట్ జీపీటీని వాడుకోవచ్చు.
బీట్ ఓవెన్
బీట్ ఓవెన్ అనే ఏఐ టూల్ ద్వార ఫ్రీ మ్యూజిక్ ట్రాక్స్ ను పొందొచ్చు. మీ యూట్యూబ్ వీడియోకి లేదా రీల్ కు కాపీరైట్ లేని ఒరిజినల్ మ్యూజిక్ కావాలనుకుంటే ఈ టూల్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు.
డీప్ ఎల్
ఇతర భాషల్లోని కంటెంట్ ను ట్రాన్స్ లేట్ చేసుకోవలనుకుంటే ఈ టూల్ వాడొచ్చు. ఈ ఏఐ టూల్ సాయంతో ఫారిన్ లాంగ్వేజ్ వీడియోలను కూడా మనకు కావాల్సిన భాషల్లోకి మార్చుకోవచ్చు.
గైడ్ (guidde.com)
ఈ ఏఐ టూల్ ద్వారా ‘హౌ టు’ గైడ్స్‌ను ప్రిపేర్ చేయొచ్చు. బిజినెస్ ప్రజెంటేషన్స్‌కు ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. స్క్రీన్ రికార్డింగ్, టెక్స్ట్ టు వాయిస్ ఓవర్, టెక్స్ట్ హైలైటింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటివి కూడా చేసుకోవచ్చు.
విడ్ ర్యాపిడ్
మీకు ఏదైనా వీడియోలోని కంటెంట్‌ను టెక్స్ట్ రూపంలో కావాలి అనుకుంటే ఈ టూల్ వాడుకోవచ్చు. వీడియో లింక్ ను సైట్ లో అప్ లోడ్ చేసి.. ఆన్‌లైన్‌లోని ఏ వీడియోకి అయినా ట్రాన్స్‌క్రిప్షన్ పొందొచ్చు. అలాగే వీడియోలోని మొత్తం కంటెంట్‌ను షార్ట్ కంటెంట్ రూపంలోకి కూడా మార్చుకోవచ్చు.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..